QS Quacquarelli Symonds: హెచ్‌సీయూకు ప్రపంచ స్థాయి గుర్తింపు

రాయదుర్గం (హైదరాబాద్‌): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కింది.

ఏడు సబ్జెక్టులలో మంచి ర్యాంకింగ్స్‌ దక్కాయి. అందులో ఆర్ట్స్‌ విభాగంలో ప్రపంచ స్థాయిలో 101–120 ర్యాంక్‌ దక్కింది. గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనలిస్ట్‌ ‘క్యూఎస్‌ క్వాక్వెరెల్లి సైమండ్స్‌’తాజాగా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌–2024ను ఏప్రిల్‌ 10న‌ విడుదల చేసింది.

చదవండి: BioAnveshana 2024: హెచ్‌సీయూకు 16న నోబెల్‌ అవార్డు గ్రహీత రాక

ఇందులో హెచ్‌సీయూలో బయోలాజికల్‌ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌–ఎకనామెట్రిక్స్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ లిటరేచర్, లింగ్విస్టిక్స్, పర్ఫార్మింగ్‌ ఆర్ట్స్, ఫిజిక్స్‌ అండ్‌ ఆస్ట్రానమీలకు ర్యాంకింగ్‌ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లోని 1,500కుపైగా విశ్వవిద్యాలయాలకు చెందిన 16,400 మందికిపైగా విద్యార్థులతో సర్వే చేసి ఈ ర్యాంకులను ఖరారు చేసినట్టు క్యూఎస్‌ సంస్థ తెలిపింది. కాగా.. క్యూఎస్‌ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌–2024లో హెచ్‌సీయూకు మంచి గుర్తింపు రావడం సంతోషకరమని హెచ్‌సీయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ బీజే రావు పేర్కొన్నారు.  చదవండి: Akhil Kumar: హెచ్‌సీయూ విద్యార్థికి రాజనీతిశాస్త్రంలో డాక్టరేట్‌

#Tags