QS World University Ranks: ‘క్యూఎస్’ ర్యాంకింగ్స్‌లో ఈ వర్సిటీ టాప్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: 2024 క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకుల్లో పలు సబ్జెక్టుల్లో తాము టాప్ ర్యాంకులు సాధించినట్లు చండీగఢ్ యూనివర్సిటీ తెలిపింది.
రెండు సబ్జెక్టుల్లో ప్రపంచంలోని టాప్–100 వర్సిటీల్లో, మూడు సబ్జెక్టుల్లో దేశంలోని ప్రైవేటు వర్సిటీల్లోనే నంబర్ వన్‌గా నిలిచినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.
చదవండి: QS Quacquarelli Symonds: హెచ్‌సీయూకు ప్రపంచ స్థాయి గుర్తింపు
ప్రైవేట్ యూనివర్సిటీల్లో చండీగఢ్ వర్సిటీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, పెట్రోలియం ఇంజనీరింగ్, సోషల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్‌లో దేశంలో టాప్ ర్యాంకులో ఉందని పేర్కొంది. ‘హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో ఆసియాలో 10వ ర్యాంకు, పెట్రోలియం ఇంజనీరింగ్‌లో 16వ ర్యాంకు సాధించాం. ఈ రెండు సబ్జెక్టుల్లో ప్రపంచంలో టాప్–100లో ఉన్నాం’ అని తెలిపింది.
Published date : 18 Apr 2024 12:24PM
Tags
- QS World University Ranks
- Chandigarh University
- Hospitality Management
- Petroleum Engineering
- Social Sciences and Management
- educational institutions
- Chandigarh University rankings
- Top-ranked subjects
- Education excellence
- University Rankings 2024
- World's top-100 universities ranking
- sakshieducation updates