QS Asia University Rankings 2024: QS క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో చైనాను వెనక్కి నెట్టిన భారత్
క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో అత్యధిక యూనివర్సిటీలు చోటుదక్కించుకొనే అంశంలో భారత్ చైనాను అధిగమించింది. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో రికార్డు స్థాయిలో 148 యూనివర్సిటీలతో భారత్ చైనా(133 యూనివర్సిటీలు)ను వెనక్కి నెట్టింది. ఆసియా దేశాల్లోని విశ్వవిద్యాలయాలకు సంబంధించి ప్రతిష్ఠాత్మక క్యూఎస్ సంస్థ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది.
ఇందులో టాప్-100 యూనివర్సిటీల్లో 7 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా టాప్ 500 విశ్వవిద్యాలయాల్లో, 69 భారతీయ విశ్వవిద్యాలయాలు ఉండటం విశేషం.ఈ జాబితాలో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా టాప్-20 స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా 24వ ర్యాంకు
ఈ విభాగంలో భారత్‌లో అత్యున్నత ర్యాంకు సాధించిన యూనివర్సిటీ జేఎన్యూనే.చెన్నైలోని సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్ డెంటిస్ట్రీ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా 24వ స్థానంలో నిలిచింది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ,యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ,ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ (IoE) సహా పలు విశ్వవిద్యాలయాలు వివిధ విభాగాల్లో టాప్-100 స్థానాల్లో మెజారిటీని సాధించాయి. QS ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024 ఎడిషన్‌లో ఈసారి ఆసియా దేశాల నుంచి మొత్తం 857 సంస్థలు ర్యాంకింగ్‌ను పొందాయి.