UGC NET June Results: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యూజీసీ నెట్‌ ఫలితాలు.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

UGC NET June Results

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) త్వరలోనే యూజీసీ-నెట్ జూన్ 2024 పరీక్ష ఫలితాలను విడుదల చేయనుంది. పరీక్ష జరిగి నెల రోజులు దాటినా ఇంత వరకు ఫలితాలు విడుదల చేయకపోవడంతో లక్షలాదిమంది విద్యార్థులు రిజల్ట్స్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

Jobs In SBI: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 10వేల ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

భారతీయ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ‘అసిస్టెంట్ ప్రొఫెసర్’ అలాగే ‘జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్’ అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి యూజీసీ నెట్ నిర్వహిస్తారు.యూజీసీ-నెట్ ప్రతి ఏడాది జూన్, డిసెంబర్ నెలల్లో రెండుసార్లు నిర్వహిస్తారు కాగా జూన్‌ 18న జరిగిన యూజీసీ నెట్‌ పరీక్ష లీకేజీ ఆరోపణలతో పరీక్షను రద్దు చేశారు.

Teacher Jobs: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

రీ ఎగ్జామినేషన్‌ను  ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 4వరకు నిర్వహించారు.  తొలిసారిగా ఆన్‌లైన్‌లో సీబీటీ(Computer based test) విధానంలో రెండో సెషన్లలో పరీక్షను నిర్వహించారు. సెప్టెంబర్‌ 7 ప్రాథమిక కీని విడుదల చేసినప్పటివకీ ఇంకా ఫలితాలు వెల్లడించలేదు. అయితే త్వరలోనే ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ లాగిన వివరాలు ఎంటర్‌ చేసి రిజల్ట్స్‌ తెలుసుకోవచ్చు. 

యూజీసీ నెట్ 2024 ఫలితాలు.. డౌన్‌లోడ్ చేసుకోండిలా :

 

  • అధికారిక వెబ్‌సైట్ (ugcnet.nta.nic.in)ని క్లిక్‌ చేయండి
  • హోమ్‌పేజీలో కనిపిస్తున్న, “UGC-NET Result 2024” అనే లింక్‌ని క్లిక్‌ చేయండి
  • మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వంటి వివరాలను ఎంటర్ చేయండి.
  • పూర్తి వివరాలను ఎంటర్‌ చేసి సబ్‌మిట్‌ బటన్‌ను ప్రెస్‌ చేయండి
  • తర్వాతి స్క్రీన్‌లో మీ రిజల్ట్  కనిపిస్తుంది.
  • స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయండి
  • భవిష్యత్‌ అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

 

#Tags