UGC NET June 2024 Re-exam: సీబీటీ విధానంలో యూజీసీ నెట్ రీఎగ్జామినేషన్.. పరీక్షల షెడ్యూల్ విడుదల
యూజీసీ నెట్ రీఎగ్జామినేషన్‌ను తొలిసారిగా ఆన్‌లైన్‌లో సీబీటీ(Computer based test) విధానంలో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. ఇందుకు సంబంధించి పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 4 వరకు యూజీసీ నెట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9-12 గంటల వరకు, మధ్యాహ్నం 3-6 గంటల వరకు రెండో సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు.
Indian Air Force Recruitment 2024: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు పోస్టులు.. చివరి తేదీ ఇదే
కాగా జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్ష లీకేజీ ఆరోపణలతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో పెన్ను-పేపర్ విధానంలో నిర్వహించిన ఈ పరీక్షకు 11 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారు. కానీ పరీక్ష రద్దు కావడంతో ఇప్పుడు మరోసారి రీఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తున్నారు.
Germany Work Visa: జర్మనీలో జాబ్.. ఇదే మంచి అవకాశం! ఎందుకో తెలుసా?
ఇంతకాలం పీహెచ్‌డీలో చేరాలంటే.. పీజీ పూర్తి చేసి.. నెట్‌లో సంబంధిత సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. యూజీసీ తాజా నిర్ణయంతో నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు కూడా నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెట్ స్కోర్ ఆధారంగా పీహెచ్‌డీలో ప్రవేశం పొందొచ్చు. యూజీసీ–నెట్‌ను ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు.
యూజీసీ నెట్ రీఎగ్జామినేషన్ విధానం:
- యూజీసీ నెట్ పరీక్ష విధానంలో ఎలాంటి మార్పులు లేవు. గతంలో మాదిరిగానే రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఈ రెండు పేపర్లు కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్. ఈ విభాగంలో 50 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్–2: సబ్జెక్ట్ పేపర్: అభ్యర్థుల డొమైన్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- పేపర్–1(టీచింగ్/రీసెర్చ్ ఆప్టిట్యూడ్) మూడు కేటగిరీల అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది.