Top 5 Jobs with Highest Payment : అధిక వేతనాలలో ఉద్యోగాలు.. దేశంలోని టాప్ 5 జాబ్స్ ఇవే..
సాక్షి ఎడ్యుకేషన్: భారతీయులు వ్యాపారాల కంటే ఉద్యోగాలపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగాల్లోనూ ఉద్యోగాలకూ పోటీ ఎక్కువే. చిన్న గుమాస్తా ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చేసినవారు పోటీ పడుతుంటారు. ఇక్కడ ఎక్కువ శాతం మంది రిస్క్, ఒత్తిడి వుండే వ్యాపారాల కన్నా హాయిగా నెలనెలా అకౌంట్లో జీతం పడే ప్రైవేట్, గవర్నమెంట్ ఉద్యోగాలనే కోరుకుంటారు.
Highcourt Job Notification : గుడ్ న్యూస్.. 1673 పోస్టుల భర్తీకి హైకోర్టు జాబ్ నోటిఫికేషన్
ఇటువంటి ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు సామాజికంగానూ ఆర్థికంగానూ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఇక ఇది నిరుద్యోగులకు గొప్ప అవకాశంగా మారి ఉన్నత ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతున్నాయి. దీంతో, ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు వేలల్లో నుంచి లక్షల్లోకి వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఇటువంటి ఒక 5 ఉద్యోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. లా:
న్యాయ కెరీర్ ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే కాకుండా సామాజిక న్యాయం, చట్ట పాలనను నిలబెట్టే అవకాశాన్ని కూడా అందిస్తుంది. న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు సమసమాజాన్ని నిర్వహించడానికి దోహదపడతారు. ఇక్కడ వారు ఉన్నత గౌరవాన్ని అలాగే, సంపదను కూడా అందుకుంటారు. మనదేశంలో ఎంతో ఖరీదైన లాయర్లు ఉన్నారు. కొందరు కేవలం గంటకు మాత్రమే కొన్ని లక్షల్లో ఫీజు తీసుకుంటారు. వారంతా సీనియర్ లాయర్లు. మరికొందరు మొదట్లోనే ఎక్కువ సంపాదించేవారు ఉంటారు.
Job Mela For Freshers: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
2. సివిల్ సర్విసెస్:
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)... ఈ పేరు వింటేనే ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది. కొన్ని చిత్రాల్లో వీరిని చూస్తేనే చాలామంది స్పూర్తిగా తీసుకొని లక్ష్యాలను ఏర్పర్చుకుంటారు. దీనికి ఉండే గౌరవం అటువంటిది. దీనిలోని గౌరవం, హోదా, సంపద ఎంతో ఎక్కువ కూడా. దేశంలో అత్యున్నతమైన ఉద్యోగాలివి. వీటిని పొందేందుకు ఏటా లక్షలాదిమంది యువత పోటీ పడుతుంటారు. దీనికి వారు రాయాల్సిన పరీక్షే యూపీఎస్సీ. కానీ కొన్ని వందలమంది మాత్రమే పేరుచివర ఐఎఎస్, ఐపిఎస్ చేర్చుకునే అవకాశాన్ని పొందుతారు. పాలనాపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం వీరికి వుంటుంది. ఇలా వీరిపై పెద్ద బాధ్యతలే కాదు మంచి జీతం, అలవెన్సులు, ఇతర సౌకర్యాలు వుంటాయి.
3. ఇంజనీరింగ్:
ఇంజనీర్లకు మరీముఖ్యంగా ఏరోస్పేస్, పునరుత్పాదక ఇంధనం, సమాచార సాంకేతికత (ఐటీ) వంటి రంగాల్లో పనిచేసేవారికి ఆకట్టుకునే ఆర్థిక అవకాశాలను అందుకుంటున్నారు. అత్యాధునిక సాంకేతికతలను రూపొందించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లేదా దేశం ఎదుర్కొంటున్న సంక్లిష్ట సవాళ్లను పరిష్కరించడం ద్వారా ఇంజనీర్లు భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తారు.
Railway Recruitment: రైల్వేలో 32 వేల ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైన వారు కూడా అర్హులు..
4. వైద్య వృత్తి:
ఈ రంగంలోకి రావాలని చాలామంది ఆశపడుతుంటారు. కాని, దీనికి ఉన్న చదువు మరే రంగంలోనూ ఉండదు. ఉన్నత చదువులు, పరీక్షలు, వృత్తిలో ఉంటూ కూడా అనేక విద్య పొందాలి. వైద్యుడు లేదా వైద్యారోగ్య రంగాలకు చెందిన నిపుణులకు మంచి ఆదాయం వుంటుంది. ఆరోగ్యం విషయంలో మనిషి ఏమాత్రం వెనక అడుగు వేయడు కాబట్టి కొందరు వైద్యులు రెండుచేతులా సంపాదిస్తుంటారు. వైద్యులతో పాటు వైద్యరంగంలో ఇతర నిపుణులు కూడా మంచి ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. ప్రభుత్వ రంగంలోనే కాదు ప్రైవేట్ రంగంలో కూడా వైద్యులకు మంచి వేతనాలు లభిస్తున్నాయి.
5. వ్యవస్థాపకత:
పెట్టుబడులు పెట్టడం, స్టార్టప్‌లను ప్రారంభించడం వలన ఆర్థిక విజయానికి మార్గం లభిస్తుంది. భారతదేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుంది. స్టార్టప్ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నందున ఈ రంగంలో కూడా యువత భారీ ఆదాయాన్ని పొందుతున్నారు. చిన్నచిన్న స్టార్టప్స్ ద్వారా వందలు వేల కోట్లు సంపాదించిన ఎంటర్ ప్రెన్యూర్స్ కూడా వున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)