School Washrooms : పాఠ‌శాల‌ల్లో మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించ‌డంపై ఎంఈఓ సూచ‌న‌లు.. ప్ర‌భుత్వ యాప్‌లలో..

పాఠశాలల్లోని విద్యార్థులు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను వారంలో రెండు రోజులు పరిశీలించాల‌న్నారు.

భోగాపురం: మండలంలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులు ఉపయోగిస్తున్న మరుగుదొడ్లను వారంలో రెండు రోజులు పరిశీలించి ఫొటోలను ప్రభుత్వానికి సంబంధించిన యాప్‌లలో అప్లోడ్‌ చేయాలని ఆయా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులకు ఎంఈఓ రమణమూర్తి సూచించారు. స్థానిక విద్యావనరుల కేంద్రంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మండలంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Job Mela: యువతకు గుడ్‌న్యూస్‌.. రేపు జాబ్‌మేళా

సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు జీపీఎస్‌ ఆధారంగా ఎప్పడు ఏ సమయంలో పాఠశాలల తనిఖీకి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో అధికారులు పాఠశాలలు తనిఖీకి వచ్చేటప్పుడు సమాచారం అందించేవారని ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవన్నారు. వారంలో రెండు రోజులు సచివాలయ వెల్ఫేర్‌ సిబ్బంది, మరో రెండు రోజులు స్కూల్‌ కమిటీ సభ్యులు, మిగిలిన రెండు రోజులు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు మరుగుదొడ్లను పరిశీలించి ఫొటోలను ప్రభుత్వం సూచించిన యాప్‌లలో అప్లోడ్‌ చేయాలని సూచించారు. సమావేశంలో ఎంఈఓ–2 బి.చంద్రమౌళి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Job Mela at Degree College : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌.. డిగ్రీ క‌ళాశాల‌లో ఈనెల 17న జాబ్ మేళా..!

#Tags