Case on Teacher: హ‌ద్దు దాటిన రీల్స్ బ్యాచ్‌.. చివ‌రికి మూల్యాంక‌నంలో కూడా!

ప‌రీక్ష‌ల మూల్యాంక‌నం స‌మ‌యంలో టీచ‌ర్ చేసిన ఒక రీల్ వైర‌ల్ అయ్యింది. దీనిపై నేటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ పెడుతున్నారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: సోషల్‌మీడియాలో పాపులర్‌ అవ్వడం కోసం, లైక్‌ల కోసం యూజర్లు చేస్తున్న పనులకు హద్దు లేకుండా పోతోంది.  తాజాగా, ఒక ఉపాధ్యాయురాలు పేపర్లు దిద్దుతూ కూడా రీల్‌ చేసింది. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. దీనిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. కట్‌ చేస్తే..

Digital Valuation: డిజిటల్ మూల్యాంక‌నంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు..

బిహార్‌లోని పాటలీ పుత్ర యూనివర్శిటీ (పీపీయూ)కి చెందిన టీచర్‌ పరీక్ష పేపర్‌ కరెక్షన్స్‌ చేస్తోంది. దీన్ని ఏకంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసిన సోషల్ మీడియాలో పోస్ట్‌  చేసింది. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు విచిత్ర విచిత్రమైన ఫన్నీ కామెంట్స్ చేశారు. 

హే మేడమ్, కొత్తగా పెళ్లైన పెళ్లికూతురులా కనిపిస్తోంది'  అని ఒకరంటే, దీన్నే పిచ్చి అంటారండి అంటూ మరొకరు ఫన్నీగా వ్యాఖ్యానించారు. ఒక టీచర్‌గా మీరు చేయాల్సిన పని ఇదేనా అంటూ చాలామంది మండి పడ్డారు. ఇలాంటివాళ్లు సిగ్గుతో చచ్చిపోవాలి.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు నమోదైనాయి అంటూ మరో యూజర్‌ కామెంట్‌ చేశారు. చివరికి ఇది ఉన్నతాధికారుల దాకా చేరడంతో టీచర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 

Tenth and Inter Students: ప‌ది, ఇంట‌ర్‌లో ఉత్త‌మ ర్యాంకులు సాధించిన విద్యార్థుల‌కు అభినంద‌న‌లు..

#Tags