Teach Tool Training : ఈనెల 18 నుంచి టీచ్ టూల్ శిక్ష‌ణ ప్రారంభం..

ఈ నెల 18 నుంచి ఉపాధ్యాయుల‌కు టీచ్ టూల్ శిక్ష‌ణ ప్రారంభం కానున్న‌ట్లు జిల్లా విద్యాశాఖాధికారి క‌మ‌ల‌కుమారి ప్ర‌క‌టించారు..

అమలాపురం: టీచ్‌ టూల్‌ అబ్జర్వర్లకు ఈ నెల 18 నుంచి 27వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు కోనసీమ జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు. పేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆమెతో పాటు సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు బుధవారం పరిశీలించారు. శిక్షణకు అవసరమైన తరగతి గదులను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాల తరగతిని పరిశీలించి, బోధనా సామర్థ్యాలను అంచనా వేసేందుకు టీచ్‌ టూల్‌ అబ్జర్వర్లను ఎంపిక చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 423 మంది అబ్జర్వర్లకు నాన్‌ రెసిడెన్షియల్‌ విధానంలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందుకు అమలాపురం డివిజన్‌ పరిధిలో పేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, రామచంద్రపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శిక్షణ కేంద్రాలుగా ఎంపిక చేశామన్నారు.

TGSRTC Fake Notification: అది ఫేక్‌ నోటిఫికేషన్‌: సజ్జనార్‌

భోజనం రుచిగా ఉండాలి

పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్ధవంతంగా నిర్వహించాలని డీఈఓ కమలకుమారి ఉపాధ్యాయులకు సూచించారు. పేరూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆమె పరిశీలించారు. ఈ పథకంలో ఆహార పదార్థాలు రుచిగా ఉండేలా హెచ్‌ఎంలు పర్యవేక్షణ చేయాలన్నారు. 100 శాతం విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఉపాధ్యాయులు చూడాలన్నారు. విద్యార్థులకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించేందుకు వారానికి ఐదు రోజులు కోడిగుడ్లు, రోజు విడిచి రోజు చిక్కీ, రాగిజావ అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబలైజేషన్‌ అధికారి బీవీవీ సుబ్రహ్మణ్యం, అకడమిక్‌ మానిటరింగ్‌ అధికారి తదితరులు ఉన్నారు.

Medical Department: ఏపీ వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్‌!

#Tags