Fake Notification: అది ఫేక్ నోటిఫికేషన్: సజ్జనార్
ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి ఇటీవల ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. ఆ భర్తీ ప్రక్రియను టీజీపీఎస్సీ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్‌మెంట్ బోర్డులు సంయుక్తంగా చేపట్టనున్నాయి.
ఇప్పటివరకు ఆయా సంస్థలు షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఓ ఫేక్ నోటిఫికేషన్ వైరల్‌గా మారింది. ఈ పోస్టుల భర్తీకి ఆర్టీసీ చర్యలు చేపట్టిందని పేర్కొంటూ ఓ బోగస్ నోటిఫికేషన్‌ను సోషల్ మీడియాలో కొందరు వైరల్ చేశారు.
చదవండి: Agniveer MR Notification : అగ్నివీర్–ఎంఆర్ నోటిఫికేషన్.. పదో తరగతి అర్హతతో పోటీ పడే అవకాశం
అందులో ఉన్న లింకును క్లిక్ చేసి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వివరాలను నమోదు చేయాలని అందులో పేర్కొన్నారు. అయితే ఇది ఫేక్ నోటిఫికేషన్ అని, అభ్యర్థులెవరూ మోసపోవద్దని సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగార్థులకు ముఖ్య గమనిక!!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) July 10, 2024
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకు సంస్థలో 3035 కొలువుల భర్తీకి సంబంధించిన కసరత్తును #TGSRTC ప్రారంభించింది. 3035 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైందని, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఉద్యోగార్థుల… pic.twitter.com/LBgfNrwAhp