Drawing Competition : తమ చిత్రాకళతో జాతీయ స్థాయికి రాణిస్తున్న పాఠశాల విద్యార్థులు..
తణుకు అర్బన్: అంశం ఏదైనా అలవోకగా చిత్రాలు గీస్తుండటమే కాక పలు ప్రాంతాల్లో నిర్వహించే పోటీల్లో రాణిస్తూ సత్తా చాటుతున్నారు. చిట్టి చేతుల్లో రూపుదిద్దుకున్న పలు చిత్రాలు జాతీయ స్థాయిలో బంగారు పతకాల పంట పండిస్తున్నాయి. ఏ అంశంలో చిత్రాన్ని వేసినా ఆ అంశం ఆ చిత్రంలో ఇమిడిపోవడం ఆ విద్యార్థుల ప్రతిభకు తార్కాణం. ఇక్కడి విద్యార్థులు చిత్రకళ పోటీల్లో పాల్గొంటున్నారంటే ఇక పతకాలు వారికే సొంతం అనేంతగా చిత్రకళలో ఎదుగుతున్నారు. పాఠశాలలో చిత్రకళలో విద్యార్థులకు అందుతున్న శిక్షణ, ఉపాధ్యాయుల కృషితో జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.
NEET-UG Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. మాస్టర్ మైండ్ ‘రాకీ’ అరెస్ట్!
జాతీయ స్థాయిలో..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు, చిత్రకళ ఆర్ట్స్ అకాడమీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి పోటీల్లో తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూలు విద్యార్థులు తమ సత్తా చాటుతున్నారు. గుంటూరు, నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో స్వచ్ఛభారత్, వాతావరణ కాలుష్యం, పచ్చదనం–పరిశుభ్రత, జాతీయ నాయకుల చిత్రాలు వంటి అంశాల్లో విద్యార్థుల గీసిన చిత్రాలు ఆహుతులను ఆలోచింపచేయడమే కాకుండా పలు పతకాలను సాధించి పెడుతున్నాయి. ఇటీవల నెల్లూరు, విజయవాడలో జరిగిన జాతీయస్థాయి చిత్రకళా పోటీల్లో 35 మంది విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించడం విశేషం. చిత్రకళలో విద్యార్థులకు నేర్పిస్తున్న మెలకువలతోపాటు విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో 100 మందికి పైగా విద్యార్థులు చిత్రకళలో సత్తా చాటుతున్నారు.
Tags
- drawing competitions
- students art talent
- School Students
- national level competitions
- Chitrakala Arts Academy
- AP Govt
- students talent test
- zp boys high school students
- Education News
- Sakshi Education News
- Urban painting competitions
- Educational empowerment through art
- Painting skills development
- National pride artwork
- StudentCompetitions