Medical Department: ఏపీ వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్!
కొత్త ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేయకపోగా గత ప్రభుత్వం చేపట్టిన నియామకాల ప్రక్రియన నిలిపివేస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా జీరో వేకెన్సీ (ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ) పాలసీని గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం ప్రవేశపెట్టింది.
ఖాళీ పోస్టులను భర్తీ చేస్తూనే, రోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ వచ్చింది. ఐదేళ్లలో ఒక్క వైద్య శాఖలోనే ఏకంగా 54 వేల పోస్టుల భర్తీని చేపట్టింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వైద్య శాఖ లో జీరో వేకెన్సీ పాలసీకి తిలోదకాలు ఇవ్వనుందని తెలుస్తోంది.
చదవండి: 607 Jobs: కాలేజీల్లో 607 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి.. 435 పోస్టులకు 2,400 దరఖాస్తులు..
ఈ క్రమంలోనే వైద్య శాఖలో ప్రస్తుతం జరుగుతున్న నియామకాల ప్రక్రియను నిలిపివే యాలని ప్రభుత్వం మౌకిక ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త వైద్య కళాశాలల్లో అవసరాల కోసం వివిధ రకాల 380 పోస్టులను డీఎంఈ పరిధిలో గతంలో మంజూరు చేయగా.. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. అలాగే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు, ఇతర ఆస్పత్రుల్లో ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ వంటి పారామెడికల్‌తో పాటు ఇతర పోస్టుల భర్తీకి జిల్లా స్థాయిల్లో నోటిఫికేషన్‌లు జారీ చేశారు.
ఉమ్మ డి 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాకు 200 నుంచి 250 పోస్టుల చొప్పున మూడు వేలకుపైగా పోస్టుల భర్తీ చేపట్టాల్సి ఉంది. దరఖాస్తులను సైతం స్వీకరించి, వాటి పరిశీలన, మెరిట్ జాబితాలను సిద్ధం చేశారు. అభ్యర్థులను ఎంపిక చేసి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చే లోగా సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో తాత్కాలికంగా నియామక ప్రక్రియ పూ ర్తయింది. ఇప్పుడు ఆ నియామకాలను ప్రభుత్వం నిలిపివేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతోంది.