Supplementary Exam: 9 నుంచి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల సప్లిమెంటరీ పరీక్షలు

కేయూ క్యాంపస్‌ : 2017 సంవత్సరం కంటే ముందు ఇయర్‌ వైజ్‌ స్కీమ్‌లో ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయ బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థుల డిగ్రీ వార్షిక పరీక్షలు (సప్లిమెంటరీ) ఈనెల 9 నుంచి ప్రారంభమై నవంబర్‌ 14వ తేదీ వరకు జరుగుతాయని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి బుధవారం తెలిపారు. వీరికి సంబంధించిన సప్లిమెంటరీ ప్రయోగ పరీక్షలు నవంబర్‌ 15 నుంచి నవంబర్‌ 21వ తేదీ వరకు, సప్లిమెంటరీ అంతర్గత పరీక్షలు నవంబర్‌ 22, 23 తేదీల్లో జరుగుతాయన్నారు. మొత్తం విశ్వవిద్యాలయ పరిధిలో 14 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. వీటిలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 4, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 6, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4 ఉన్నాయన్నారు. మరిన్ని వివరాలు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడొచ్చని వారు తెలిపారు.

చ‌ద‌వండి: AP SSC Exam Fee: 10వ తరగతి పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

#Tags