State Level Chess: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో గెలిచిన విద్యార్థులు వీరే..

విద్యార్థులు విద్యలోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలి. అందుకోసమే భీమవరంలో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ మాట్లాడుతూ..

సాక్షి ఎడ్యుకేషన్‌: విద్య, వైద్య రంగాలకు ఎనలేని సేవలందిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ కుటుంబం క్రీడా రంగానికి తన వంతు సహకారం అందించడం అభినందనీయమని వైఎస్సార్‌సీపీ నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి  ఉమాబాల అన్నారు. భీమవరంలో దివంగత గ్రంధి వెంకటేశ్వరరావు పేరిట జిల్లా చెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఓపెన్‌ చెస్‌ పోటీల్లో విజేతలకు ఆదివారం బహుమతులు అందించారు.

Technology: విద్యా‍ర్థులు టెక్నాలజీకి అనుగుణంగా ఉండాలి..!

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదరంగంతో జ్ఞాపకశక్తి పెంచుకోవచ్చన్నారు. పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 167 మంది క్రీడాకారులు హాజరుకాగా వారిలో 20 మంది విజేతలుగా నిలిచారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు గ్రంధి రవితేజ, పట్టణ అధ్యక్షుడు తోట భోగయ్య, చెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.భీమారావు, జిల్లా అధ్యక్షుడు మాదాసు కిషోర్‌, తోట హరిబాబు, ఎం.మురళీ తదితరులు ఉన్నారు.

Intermediate Practical: ఇంటర్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు మొదలు..

విజేతలు వీరే.. 

సింహాద్రి సాయిహృషికేష్‌, డి.సాత్విక్‌, కె.రాజేష్‌ (కోనసీమ), ఎం.భార్గవ్‌ సుశాంత్‌ సాకేత్‌, టీవీఎస్‌ కావ్యశ్రీ, కె.సీతాసాగర్‌(తూర్పుగోదావరి), ఎ.నాగశివసాయి దివ్య, టి.నాగు ఉదయ్‌ అనురాగ్‌, టి.శ్రీలాస్య (గుంటూరు), ఎన్‌.ప్రీత మ్‌ దర్శిన్‌(ఎన్‌టీఆర్‌) విజేతలుగా నిలిచారు. అండర్‌–7 విభాగంలో ఎ.కావ్య, ఎ.ప్రభంజన్‌, అండర్‌–9 విభాగంలో వై.సుజమ్‌, జె.సవితరెడ్డి, అండర్‌–11 విభాగంలో ఎం.సుజిత, వై.ప్రేమ్‌రక్షిత, అండర్‌–13 విభాగంలో వి.హేమంత్‌కుమార్‌, పి.సుచి త్ర క్రిస్టీ, అండర్‌–15 విభాగంలో ఎ.జయ ప్రకాష్‌, కె.సోనాలికార్తీక్‌ విజేతలుగా నిలిచారు.

#Tags