Summer Science Camps: వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రారంభం
Sakshi Education
కడప కల్చరల్: వైఎస్సార్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని ప్రధాన కార్యాలయంతోపాటు జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాల్లో మే 16న నుంచి వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహించనున్నట్లు సంస్థ జిల్లా కార్యదర్శి అమీరుద్దీన్ తెలిపారు.
తమ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను జూన్ 7వ తేది వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతిరోజు విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: SCCL: ఉచితంగా వేసవి శిక్షణ శిబిరాలు
ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పిల్లల్లో చదివే అలవాటును పెంచేందుకు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం కింద పుస్తక పఠనం చేయించడం శిక్షణలో ముఖ్యమైన అంశమన్నారు.
జూన్ 7న కార్యక్రమాల ముగింపు సందర్బంగా అతిథులతో వారికి శిక్షణలో పాల్గొన్న సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్నట్లు, వలంటీర్ల సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రాలను అందజేయనున్నట్లు వివరించారు.
Published date : 17 May 2024 04:10PM