Skip to main content

Paris Olympics 2024: ఒలింపిక్స్‌కు తెలంగాణ అమ్మాయి.. ఒలింపిక్స్‌లో పాల్గొనే టీటీ జట్లు ఇవే..

పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) జట్లను అఖిల భారత టేబుల్‌ టెన్నిస్‌ సంఘం (టీటీఎఫ్‌ఐ) ప్రకటించింది.
Indian Table Tennis Team Announced for Paris Olympics 2024

మే 16వ తేదీ అంతర్జాతీయ టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీటీఎఫ్‌) ర్యాంకింగ్స్‌ ప్రకారం భారత్‌ నుంచి టాప్‌–3లో ఉన్న క్రీడాకారులను జట్లలోకి ఎంపిక చేశారు. 

తొలిసారి టీమ్‌ విభాగంలో భారత పురుషుల, మహిళల జట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాయి. రెండుసార్లు జాతీయ చాంపియన్, తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ తొలిసారి ఒలింపిక్స్‌లో పోటీపడనుంది. 

పురుషుల, మహిళల టీమ్‌ విభాగంలో ముగ్గురి చొప్పున ఎంపిక చేయగా.. ఈ ముగ్గురిలో టాప్‌–2లో ఉన్న ఇద్దరు సింగిల్స్‌ విభాగాల్లోనూ పోటీపడతారు. ఒక్కొక్కరిని రిజర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. 

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత పురుషుల-మహిళల రిలే జట్లు..

తుది జట్టులో ఎవరైనా గాయపడి అందుబాటులో లేకపోతే రిజర్వ్‌ ప్లేయర్‌ను ఆడిస్తారు. పురుషుల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్న ఆచంట శరత్‌ కమల్‌ ఐదోసారి ఒలింపిక్స్‌లో పాల్గోంటారు. పారిస్‌ ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి.  

భారత మహిళల జట్టు: మనిక బత్రా, శ్రీజ, అర్చన కామత్, అహిక ముఖర్జీ (రిజర్వ్‌). 
భారత పురుషుల జట్టు: శరత్‌ కమల్, హర్మీత్‌ దేశాయ్, మానవ్‌ ఠక్కర్, సత్యన్‌ జ్ఞానశేఖరన్‌ (రిజర్వ్‌).

Manika Batra: కెరీర్ బెస్ట్ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించిన మనిక బాత్రా.. తొలిసారి ఇలా!

Published date : 17 May 2024 03:07PM

Photo Stories