Students Academic Books : అధిక బ‌రువును మోస్తున్న విద్యార్థులు.. ఈ పాఠ్య‌పుస్త‌కాల‌తోనే బోధ‌న చేయాలి..

ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన వయసులో పుస్తకాల భారం విద్యార్థులకు శాపంగా మారుతోంది. పై తరగతికి వెళ్లే కొద్దీ.. పుస్తకాల సంఖ్య కూడా దానికి తగ్గట్టుగానే పెరుగుతోంది.

చిత్తూరు: ప్రైవేటు స్కూళ్లలో వాటిని మోస్తూ పిల్లలు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు. బ్యాగు నిండా పుస్తకాలతో నాలుగైదు అంతస్తుల మెట్లు ఎక్కేందుకు నానా తంటాలు పడుతున్నారు. పుస్తకాల భారం తగ్గించాలని 2006లో చట్టం చేసినా అమలుకు మాత్రం విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాల తీరుతో చిన్నారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. కార్పొరేట్‌ ఆర్భాటాల కారణంగా వయసుకు మించిన భారం మోస్తున్నారు. ఇష్టారాజ్యంగా అంటగడుతున్న పుస్తకాలను మోయలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. లేలేత భుజాలపై మోపుతున్న బుక్స్‌ బరువుకు కుంగిపోతున్నారు.

Guest Lecturer Posts : మ‌హిళ అభ్య‌ర్థుల‌కు గెస్ట్ లెక్చ‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ స‌బ్జెక్టుల్లోనే..

ఎదుగుదల లోపం వంటి అనారోగ్య సమస్యలకు గురై ఉక్కిరిబిక్కిరవుతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిబంధనలను పాటించని ప్రైవేట్‌ బడులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు.

ప్రైవేట్‌గానూ కొనుగోలు..

ప్రభుత్వ పాఠశాలలు, సర్కారు గుర్తింపు పొందిన బడుల్లో విధిగా గవర్నమెంట్‌ ముద్రించిన పాఠ్యపుస్తకాలతోనే విద్యార్థులకు బోధన చేయాలి. స్టేట్‌, సీబీఎస్‌ఈ సిలబస్‌ మినహా మరే ఇతర పాఠ్యాంశాలను బోధించకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు మాత్రం ఐఐటీ కోచింగ్‌, స్మార్ట్‌ క్లాసులు, రివిజనన్‌ టెస్టుల పేరుతో సాధారణ పాఠ్యపుస్తకాలతోపాటు ప్రైవేట్‌ ముద్రణ సంస్థల పుస్తకాలను కొనుగోలు చేయాల్సిందిగా తల్లిదండ్రులకు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు అదనపు పుస్తకాలను పాఠశాలలోనే కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Gurukul Admissions Counselling : జులై 2, 3 తేదీల్లో గురుకుల ప్ర‌వేశానికి కౌన్సెలింగ్ ప్రారంభం..

కొరవడిన పర్యవేక్షణ

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో నిబంధనలను పర్యవేక్షించాల్సిన విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థుల బడి సంచి బరువుపై ప్రభుత్వం జీఓ నంబర్‌ 22 విడుదల చేసింది. తరగతుల వారీగా అన్ని యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లల్లో పుస్తకాల బరువు నిర్ణయించి, అంతే ఉండాలని స్పష్టం చేసింది. ఆయితే ఆ జీఓను ఏ ప్రైవేట్‌ పాఠశాల అమలు చేయడం లేదు.

నిబంధనలు బేఖాతర్‌

డీఈఓ ద్వారా వార్షిక విద్యా ప్రణాళిక విడుదలవుతుంది. పాఠ్యాంశాలు, పరీక్షలు, సాంస్కృతిక, ఆరోగ్య పరిరక్షణ కింద పలు అంశాలతో పట్టిక రూపొందించాల్సి ఉన్నప్పటికీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల కోసం ప్రత్యేక నిబంధనలతో పట్టిక విడుదల చేసి, ఆయా పాఠశాలల్లో రోజువారీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాల్సి ఉండగా క్షేత్రస్తాయిలో ఆ విధానం అమలు కావడం లేదు.

Paris Olympics: 14 ఏళ్లకే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ధినిధి దేసింగు

న్యూస్‌రీల్‌

నిబంధనల అమలులో విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ శూన్యం. ప్రైవేట్‌, కార్పొరేట్‌ బడుల్లో ఇష్టానుసారం సొంతంగా ముద్రించిన పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఈ మేరకు రూ.వేలు గుంజేస్తున్నారు. వీరి అంటగట్టే పుస్తకాలను మోయలేక చిన్నారులు అలసిపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు చేపట్టాలి. పిల్లలకు ఇబ్బందులు తప్పించాలి.

– శివారెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు

అధిక బరువుతో విద్యార్థులకు నష్టం

అధిక బరువును విద్యార్థులు ఏ మాత్రం మోయకూడదు. పాఠశాల వయసులో పిల్లలపై ఎక్కువ భారం మోపుతున్నారు. దీంతో వెన్నెముకపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. సాధ్యమైనంత వరకు తక్కువ పుస్తకాలనే తీసుకెళ్లాలి.

– ప్రవీణ, మెడికల్‌ ఆఫీసర్‌, పూతలపట్టు

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టు ఇదే.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్

అనవసరమైనవే ఎక్కువ

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు 6 నుంచి 7 వరకు పాఠ్యపుస్తకాలు, మరో 6 నోట్‌బుక్స్‌, కాపీరైట్‌కు సంబంధించి 4 పుస్తకాలు ఉంటాయి. ప్రైవేట్‌ పాఠశాలలు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ 10 నుంచి 34 వరకు పుస్తకాలు, నోటుబుక్స్‌ అమ్ముతున్నారు. తల్లిదండ్రులపై ఫీజులు, విద్యార్థులపై పుస్తకాల భారం మోపుతున్నారు. ఒకటో తరగతి చదివే విద్యార్థికి సాధారణంగా 14 పుస్తకాలు ఉండాలి. కానీ, 32 నుంచి 34 ఉంటున్నాయి. ప్రింటెడ్‌ కాపీరైట్‌, ప్రింటెడ్‌ కలర్‌ కంపోజింగ్‌, హోమ్‌ స్కూల్‌ ఎక్సర్‌సైజ్‌, రైటింగ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, లాంగ్వేజ్‌ డిక్షనరీ, డ్రాయింగ్‌ తదితరాలను అదనంగా జోడిస్తున్నారు.

EAPCET Engineering Counselling 2024: టెక్నాలజీపై పట్టు సాధించాలని నిపుణుల సూచన... ఏ బ్రాంచ్ తో కెరీర్ బాగుంటుందంటే!

#Tags