Skip to main content

Gurukul Admissions Counselling : జులై 2, 3 తేదీల్లో గురుకుల ప్ర‌వేశానికి కౌన్సెలింగ్ ప్రారంభం..

Narpala BC Gurukula School counseling dates  Mahatma Jyotiba Poole BC Gurukula schools selection list Mahatma Jyotiba Poole BC Gurukula schools selection list announcement  Counseling session for vacant seats in Anantapur district schools  Counselling for students selected from entrance exam for admissions at gurukul school

అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9 తరగతుల సీట్ల భర్తీకి ఎంపిక జాబితా సిద్ధమైంది. ఈ నెల 20, 21 తేదీల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 63 సీట్లకు మొత్తం 1,301 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. 957 మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. మెరిట్‌ జాబితా ప్రకారం అన్ని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలల నోటీస్‌ బోర్డుల్లో ప్రదర్శించారు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టు ఇదే.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ సింగ్

ఎంపికైన విద్యార్థులకు సంబంధించి బాలురకు నార్పల బీసీ గురుకుల పాఠశాలలో జూలై 2న, బాలికలకు 3న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని కౌన్సెలింగ్‌ జోనల్‌ ఆఫీసర్‌ రాజేంద్రనాథకుమార్‌రెడ్డి, కన్వీనర్‌ సంగీతకుమారి ఓ ప్రకటనలో తెలియజేశారు. 1:2 నిష్పత్తిలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలన్నారు. మెరిట్‌ విద్యార్థులకు ఫోన్‌ ద్వారా సమాచారం తెలియజేస్తామని వెల్లడించారు.

ISRO: పుష్పక్‌గా పిలువబడే.. పునర్వినియోగ ప్రయోగ వాహన పరీక్ష సక్సెస్

Published date : 29 Jun 2024 08:58AM

Photo Stories