Semester Exams: కాకతీయ యూనివర్సిటీ రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం.. ఎప్పటివరకంటే
కేయూ క్యాంపస్: కేయూ పరిధి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని పీజీ కోర్సుల ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ (రెగ్యులర్, ఎక్స్, ఇంప్రూవ్‌మెంట్) రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం (నేటి) నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బీఎస్‌ఎల్ సౌజన్యజీ మంగళవారం తెలిపారు.
Job Mela: ఈనెల 9న జాబ్‌మేళా.. నెలకు జీతం రూ.20వేలకు పైగానే
ఈనెల 7, 9, 12, 14, 16, 19 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. వర్సిటీ పరిధిలో 5,150 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 27 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
#Tags