Reunion After 25 Years: రైల్వే హైస్కూల్ విద్యార్థులు.. పాతికేళ్ల త‌రువాత‌!

పాతికేళ్ల త‌రువాత మ‌ళ్ళీ త‌మ పాఠ‌శాల‌లో క‌లుసుకున్నారు రైల్వే హైస్కూల్ విద్యార్థులు. అందరు త‌మ‌ జీవితాల్లో ఉన్న‌త స్థాయిలో స్థిర‌ప‌డ్డా, ఇలా క‌లుసుకొని స‌ర‌దాగా గ‌డిపారు..
Passed out Students of Railway High School

సాక్షి ఎడ్యుకేష‌న్: ఒకే స్కూల్‌లో చదువుకున్న వారంతా పాతికేళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ సందడిగా గడిపారు. వివరాలు.. గుంతకల్లులోని రైల్వే హైస్కూల్‌లో 1998లో పదో తరగతి చదువుకున్న వారందరూ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడ్డారు.

➤   60 Years Celebrations For School: వజ్రోత్స‌వ వేడుక‌ల‌ను జ‌రుపుకుంటున్న శ్రీ‌శైలం ప్రాజెక్టు హైస్కూల్..

దసరా సెలవుల నేపథ్యంలో కుటుంబాలతో సొంతూళ్లకు వచ్చిన వారందరూ ఆదివారం ఉదయం రైల్వే హైస్కూల్‌లో కలుసుకున్నారు. తరగతి గదుల్లో బెంచీపై కూర్చొని నాడు తాము చేసిన అల్లర్లను గుర్తు చేసుకుని మురిసిపోయారు. ప్రస్తుత ప్రిన్పిపాల్‌ మధుసూదన్‌తో కలసి కేక్‌ కట్‌ చేసి, సందడి చేశారు. పాత గుత్తి రోడ్డులోని అరక్షిత శిశు మందిరంలో అనాథలకు అన్నదానం చేసి కాసేపు సరదాగా గడిపారు.

#Tags