Hostel Students : వ‌స‌తి గ్రుహాల్లో విద్యార్థుల ఇబ్బందులు..

ఈ నెల 12వ తేదీన హాస్టల్స్‌ను ప్రారంభించినా ఇంతవరకు అత్య‌వ‌స‌ర సౌక‌ర్యాల‌ను అందించ‌లేదు. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల‌ను ఎదురుకుంటున్నారు..

తిరుపతి: వసతి గృహాలు అందుబాటులోకి వచ్చినా విద్యార్థులకు దుప్పుట్లు అందక నానా తిప్పలు పడుతున్నారు. గతంలో హాస్టల్స్‌ ప్రారంభించిన రోజే వారికి దుప్పట్లు పంపిణీ చేసేవారు. ఈ నెల 12వ తేదీన హాస్టల్స్‌ను ప్రారంభించినా ఇంతవరకు దుప్పట్ల ఊసేలేదు. సాధారణంలో బడుగుబలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటుంటారు. జిల్లాలో 62 ఎస్సీ హాస్టల్స్‌ ఉండగా.. అందులో ప్రీమెట్రిక్‌ వసతి గృహాల్లో 2,968 మంది, పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాల్లో 734 మంది విద్యార్థులు తలదాచుకుంటున్నారు.

Study Center : ఓపెన్ ప‌ది, ఇంట‌ర్ స్ట‌డీ సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌కు ద‌ర‌ఖాస్తులు.. ఇవి త‌ప్పనిస‌రిగా పాటించాలి!

మరోవైపు 64 బీసీ వసతి గృహాలుండగా ఇందులో ప్రీమెట్రిక్‌ హాస్టల్స్‌లో 2,926 మంది, పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో 2,592 మంది విద్యార్థులు చదువుచున్నారు. అయితే వారికి ఇప్పటి వరకు ఎలాంటి దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయలేదు. విద్యార్థి కప్పుకోవడానికి ఒక దుప్పటి, కింద వేసుకోవడానికి మరో దుప్పటి చొప్పున రెండు ఇవ్వాల్సి ఉంది. కానీ రెండు దుప్పట్లు ఇవ్వకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కింద గార చల్లగా ఉండడంతో రాత్రుల్లో నిద్ర పట్టడంలేదని పలువురు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఇక చీకటిపడితే దోమల బాధ ఎక్కువవుతోంది. కప్పుకోవడానికి కనీసం దుప్పటి కూడా లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని కన్నీటిపర్యంతమవుతున్నారు.

First Class Admissions : 1వ తరగతిలో ఉచిత ప్రవేశానికి 3వ ఎంపిక జాబితా విడుద‌ల‌..!

#Tags