Career Advice from IAS: పోటీ ప్రపంచంలో నిలవాలంటే... ఇలా చేయాలి: కలెక్టర్‌ పమేలా ఐఏఎస్

కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో యువ‌త కోసం నిర్వ‌హించిన జాబ్‌మేళాను ప్రారంభించిన క‌లెక్ట‌ర్‌, మానకొండూర్‌ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే స‌తీమ‌ణి ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా విద్యార్థుల‌తో ప్రోత్సాహికంగా మాట్లాడుతూ నేటి పోటీ ప్ర‌పంచం గురించి తెలిపారు..

తిమ్మాపూర్‌: పోటీ ప్రపంచంలో గెలిచి నిలవడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటూ అదనపు స్కిల్స్‌తో ముందుండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. కొత్తపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం మానకొండూర్‌ నియోజకవర్గస్థాయి జాబ్‌మేళా నిర్వహించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులశాఖ సౌజన్యంతో నిర్వహించిన జాబ్‌మేళాను కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే సతీమణి అనురాధ ప్రారంభించారు.

Jobs In Medical College: నిరుద్యోగ తీవ్రత.. పోస్టులు 155, కానీ దరఖాస్తులు 5వేలకు పైగానే..

జాబ్‌మేళాను ఉద్దేశించి డా.కవ్వంపల్లి అనురాధ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్‌మేళా నిర్వహించామన్నారు. అనంతరం జాబ్‌మేళాకు హాజరైన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే హాజరుకావాల్సి ఉన్నా కొన్ని అనివార్య కారణాలవల్ల రాలేకపోయారని, వారి తరఫున కార్యక్రమానికి వచ్చానన్నారు. ఉద్యోగం పురుష లక్షణమని ఒకప్పుడు అనేవారు కానీ ఇప్పుడు ఉద్యోగం స్త్రీ ల‌క్ష‌ణంటూ పురుషులతో సమానంగా పోటీపడుతూ వారి కన్నా ఉన్నత ఉద్యోగాల్లో పెద్ద ప్యాకేజీలు పొందుతున్న మహిళలనున్నారని అన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవసరమని, ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు పొందలేకపోతున్నారు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని చిన్నా పెద్ద అనే తేడా లేకుండా వచ్చిన ఉద్యోగంలో చేరాలని సూచించారు.

Teachers Promotions: ఎస్జీటీలకు న్యాయం చేయాలి

#Tags