DSC Free Coaching : బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వాల్సిందే..

డీఎస్సీ పోటీ పరీక్షకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత శిక్షణలో డీఎడ్‌ అభ్యర్థులకు మొండిచెయ్యి చూపించారు.

తిరుపతి: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 52 వేల మందికి పైగా బీఈడీ అభ్యర్థులు, 13 వేల మందికి పైగా డీఎడ్‌ అభ్యర్థులు ఉన్నారు. వీరంతా త్వరలో నిర్వహించనున్న డీఎస్పీ పరీక్షకు సిద్ధమవుతున్నారు. ఇందులో 30 వేల మంది బీఈడీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉన్నారు. ఏడు వేల మంది డీఎడ్‌ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ బీసీలు పరీక్షలకు సిద్ధమవుతున్నారు.

అయితే రాష్ట్ర ప్రభుత్వం డీఎడ్‌ చేసిన వారికి ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా చేతులెత్తేసింది. మరోవైపు బీఈడీ చేసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 30 వేల మంది ఉంటే.. వారిలో 200 మందికి మాత్రమే ఉచిత శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు దరఖాస్తులు ఆహ్వానించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బీఈడీలో మెరిట్‌ ఆధారంగా మొదటి 200 మందిని తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.

Tamil Actor Vijay : నీట్ పేపర్ లీక్‌ వివాదంపై.. ప్ర‌ముఖ నటుడు విజయ్ ఏమ‌న్నారంటే..?

బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీకి ఉచిత శిక్షణ

తిరుపతి ఎమ్మార్‌పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇవ్వవ్వనున్నట్టు కలెక్టర్‌ ధ్యానచంద్ర మంగళవారం తెలిపారు. ఆ మేరకు బుధవారం నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. అయితే 200 మందిని మాత్రమే ఎంపిక చేస్తామని, వారికి ఈ నెల 15వ తేదీ నుంచి 60 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణతోపాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ అందజేస్తామని తెలిపారు.

బీఈడీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తమ ప్రొవిజనల్‌ సర్టిఫికెట్‌తోపాటు పదోతరగతి, ఇంటర్‌, డిగ్రీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, మూడు పాస్‌ఫొటో సైజ్‌ ఫొటోలు బీసీ స్టడీ సర్కిల్‌లో 4–171–2 మొదటి క్రాస్‌, శ్రీకృష్ణ నగర్‌, ముత్యాలరెడ్డిపల్లిలో అందజేయాలని కోరారు. వార్షిక ఆదాయం రూ.లక్ష లోపు ఉండాలని స్పష్టం చేశారు. అదనపు సమాచారం కోసం 9346221553, 9490733351, 9441456039 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Narayana Health: దేశంలోనే తొలిసారి.. రూ.10 వేలకు కోటి ఆరోగ్య బీమా!

#Tags