Free training: స్వయం ఉపాధికి ఉచిత శిక్షణ.. ఉచిత భోజన వసతి

రంపచోడవరం: గిరిజన యువతీ యువకులకు ఆర్థిక తోడ్పాటు అందించే చర్యల్లో భాగంగా యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ద్వారా శిక్షణ ఇస్తున్నట్టు స్థానిక ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

డ్రైవింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సు, హ్యాండ్‌ ఎంబ్రైడరీ, పుట్టగొడుగుల పెంపకం, వెదురుతో వస్తువుల తయారీ కోర్సుల్లో ఆసక్తి గల యువతకు 30 నుంచి 60 రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పారు. ఉచిత భోజన వసతి కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు వెలుగు ఏపీడీకి ఫిబ్రవరి 4వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

చదవండి: Employment opportunities: యువతకు ఉపాధి అవకాశాలు

#Tags