Govt ITI Admissions: ఐటీఐలో మొదటి విడత అడ్మిషన్లు ప్రారంభం.. అర్హులు వీరే!
Sakshi Education
ఆసక్తి గల అభ్యర్థులు ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని కన్వీనర్ రాయప్పరెడ్డి తెలిపారు..
హిందూపురం: జిల్లాలో పదో తరగతి పాసైన విద్యార్థులకు లేపాక్షిలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో మొదటి విడత అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కన్వీనర్ రాయప్పరెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై పదో తేదీ సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
AP Tenth Supplementary: ఈనెల 24న పదో తరగతి సప్లిమెంటరీ ప్రారంభం.. షెడ్యూల్ ఇలా!
దరఖాస్తులను లేపాక్షి ప్రభుత్వ ఐటీఐలో తప్పనిసరిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ చేసుకున్న అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కు అర్హులవుతారని చెప్పారు. ఐటీఐలో శిక్షణ పొంది సర్టిఫికెట్ పొందిన వారికి పారిశ్రామిక ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ సంస్థలలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలియజేశారు.
Employment : 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
Published date : 21 May 2024 05:31PM