Employment opportunities: యువతకు ఉపాధి అవకాశాలు
రేఖపల్లిలో జంక్షన్‌లో బుధవారం ప్రేరణ కార్యక్రమంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 18 నుంచి 30 సంవత్సరాల వయసు ఉండి ఇంటర్ ఉత్తీర్ణత కలిగిన యువతులు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆయన చెప్పారు. ఈ మేరకు ఎటపాకలో ఈ నెల 12 న పరీక్ష నిర్వహించనున్నట్టు చెప్పారు.పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కర్ణాటక రాష్ట్రం హోసూర్‌లో టాటా టెక్నాలజీ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి వారి ఆధ్వర్యంలో ఉద్యోగం కల్పించనున్నట్టు తెలిపారు. ఉద్యోగం పొందిన వారికి వసతి, భోజన సౌకర్యం కల్పించి నెలకు రూ.17,853 జీతంగా అందజేస్తారని తెలిపారు. గతంలో జిల్లా నుంచి సుమారు 80 మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందారన్నారు.. హెచ్‌సీ నిర్మల్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
చదవండి: AP DSC Notification 2024: ఈ జిల్లాలో భర్తీ కానున్న 712 ఉపాధ్యాయ పోస్టులు..
రాజవొమ్మంగి: పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో యువతకు ఉపాధి కల్పిస్తున్నట్టు సీఐ స్వామి నాయుడు చెప్పారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి జడ్డంగి పోలీసుస్టేషన్‌లో దరఖాస్తులు పొందవచ్చని, మరిన్ని వివరాలకు సిబ్బందిని సంప్రదించవచ్చన్నారు.
మోతుగుడెం: డొంకరాయి పోలీసుస్టేషన్ పరిధిలోని సింధువాడలో ఎస్‌ఐ శివకుమార్ బుధవారం పర్యటించారు. ఆయన మాట్లాడుతూ యువతకు పోలీసు శాఖ అండగా నిలుస్తోందని, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గ్రామంలో యువతకు వాలీబాల్ కిట్ అందజేశారు.