Free Coaching: ఉచితంగా సివిల్స్‌లో శిక్షణ.. ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలకు సిద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు హైదరాబాద్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రెసిడెన్షియల్‌ పద్ధతిలో ఇచ్చే శిక్షణకు ఆసక్తి గలవారు ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి సమాచారం కోసం సెల్‌ నం.62817 66534ను సంప్రదించాలని సూచించారు.

డీఈఈ సెట్‌కు దరఖాస్తులు..
వివిధ డైట్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం నిర్వహించే డీఈఈ సెట్‌కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రవీందర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

UPSC Civils Prelims Exam 2024: రేపు యూపీఎస్సీ ప్రిలిమ్స్.. రెండు సెష‌న్స్‌లో ఈ ప‌రీక్ష‌.. ఈ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి..


ఎస్టీ గురుకులాల్లోడిగ్రీ స్పాట్‌ అడ్మిషన్లు
గిరిజన సంక్షేమ గురుకులాల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగే స్పాట్‌ అడ్మిషన్లకు విద్యార్థులు బోనోఫైడ్‌, ఆధార్‌ కార్డు, టీజీయూసెట్‌ హాల్‌టికెట్‌, ర్యాంక్‌కార్డు, ఇతర జిరాక్సులతో కౌన్సిలింగ్‌ రావాలన్నారు. మరింత సమాచారం కోసం సెల్‌ నం.79010 97704ను సంప్రదించాలని కోరారు.

#Tags