ESCI New Courses: ఎస్కీలో నాలుగుకొత్త కోర్సులు..ఆగస్టు నుంచే క్లాసులు, ఫీజు వివరాలు ఇవే

రాయదుర్గం: ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్కీ)లో నాలుగు కొత్త కోర్సులకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం ఎస్కీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.రామేశ్వరావు కోర్సుల వివరాలను వెల్లడించారు. ఆర్బిట్రేషన్‌లో ఏడాది వ్యవధితో గత పీజీ సర్టిఫికేషన్‌ కోర్సును ఆగస్టు మొదటి వారంలో క్లాసులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

Mega Job Mela: జాబ్‌ మేళాలో 52 కంపెనీలు... 1500 ఉద్యోగాలు

సైబర్‌ సెక్యూరిటీలో ఏడాది వ్యవధి గత పీజీ సర్టిఫికేషన్‌ కోర్సును కూడా ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఒక్కో కోర్సు ఫీజు రూ.1.20 లక్షలు ఉంటుందన్నారు. రెండు కోర్సులకు ఫీజు జులై 30 వరకు కాలేజీలో చెల్లించవచ్చన్నారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థును ఎంపిక చేస్తామన్నారు.

ఆర్బిట్రేషన్‌ కోర్సులో చేరేవారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, ఫైనల్‌ చదివే వారు కూడా అర్హులని పేర్కొన్నారు. సైబర్‌ సెక్యూరిటీలో ఏదైని గ్రాడ్యుయేషన్‌ కోర్సులో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదివే వారు కూడా అర్హులని పేర్కొన్నారు.

Great Grandmother Gets Masters Degree: 105 ఏళ్ల వయసులో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తిచేసిన బామ్మ..

కాగా.. ఒక ఏడాది కాల పరిమితితో కూడిన పీజీ డిప్లోమో ఇన్‌ జనరల్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమో ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రీయల్‌ సేఫ్లీ, ఎన్విరాన్‌మెంట్‌ కోర్సులను ఎస్కీలోని స్కూల్‌ ఆఫ్‌ పోస్టు గ్రాడ్యుయేషన్‌ స్టడీస్‌లో ప్రవేశ పెడుతున్నట్లు ఆయన వివరించారు. వీటి కోసం అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు.
 

#Tags