Mega Job Mela: జాబ్ మేళాలో 52 కంపెనీలు... 1500 ఉద్యోగాలు
ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ములుగు మండలం ఇంచర్ల పంచాయతీ పరిధిలోని ఎంఆర్ గార్డెన్‌లో మెగాజాబ్ మేళా నిర్వహించారు. ఇందులో 52 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ జాబ్ మేళాలో 1500 మంది ఎంపిక కాగా వారికి నియామక పత్రాలు అందించారు. జాబ్‌మేళాను ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేసి పేరు తెచ్చువాలన్నారు. ములుగు జిల్లాలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ టీఎస్ దివాకర్ మాట్లాడుతూ ఉద్యోగం ఏదైనా ఇష్టపడి చేయాలన్నారు. అప్పుడే అవకాశాలు వాటంతట అవే వస్తాయన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించిన మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శబరీష్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
☛ Good News For 10th Pass Candidates : గుడ్‌న్యూస్.. పదో తరగతి అర్హతలోనే 50000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. త్వరలోనే..
Tags
- Job mela
- Mega Job Mela
- Mega Job Mela 2024
- Mega Job Mela in Telangana
- unemployed
- telangana minister seethakka
- skill development center
- Mulugu District
- Employment
- employment opportunities
- job opportunities
- Education News
- Telangana News
- employment opportunities
- Appointment documents
- Job Fair
- Child Welfare Minister
- Rural Development
- Panchayat Raj
- Mulugu Rural