Entrance Exam: ఇంటర్‌ దరఖాస్తులకు ఆహ్వానం.. ఇదే చివరి తేదీ..!

పలు జిల్లాల వ్యప్తంగా అర్హులైన అభ్యర్థులంతా ప్రకటించిన తేదీలోగా పరీక్షకు దరఖాస్తులు చేసుకోవాలని ఐటీడీఏ తెలిపారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఆయన ప్రవేశ పరీక్ష గురించి వివరణ ఇచ్చారు..

సాక్షి ఎడ్యుకేషన్‌: పార్వతీపురం ఐటీడీఏ పరిధి జోగింపేటలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సు (ప్రతిభా పాఠశాల)లో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆంగ్ల మాధ్యంలో 8వ తరగతి, ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం ప్రవేశానికి బాలురు దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, పశ్చిమ గోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్‌టీఆర్‌ జిల్లాలకు చెందిన అభ్యర్థులు మార్చి 25 లోగా www.aptwgurukulam.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Students Scholarship Exam: మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్షలో సాధించిన విద్యా‍ర్థులను అభినందించిన కలెక్టర్‌..

8వ తరగతిలో 45 సీట్లు, ఇంటర్‌ ఎంపీసీలో 45 సీట్లు, బైపీసీలో 45 సీట్లు ఉన్నాయన్నారు. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం లక్ష రూపాయల్లోపు ఉన్న వారు అర్హులన్నారు. దీనికి సంబంధించి ఏప్రిల్‌ 7న కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్ష జోగింపేటలో ఉదయం 10.30 నుంచి మద్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామన్నారు. వివరాలకు కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ 94909 57218, ప్రిన్సిపాల్‌ 94401 03332 నంబర్లును సంప్రదించాలన్నారు.

#Tags