Students Scholarship Exam: మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షలో సాధించిన విద్యార్థులను అభినందించిన కలెక్టర్..
సాక్షి ఎడ్యుకేషన్: మండలంలోని గెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. పీహెచ్‌సీ వచ్చిన రోగులకు సకాలంలో వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు ఇవ్వాలని తెలిపారు. పీహెచ్‌సీ ప్రతీ రోజు ఎంత మంది రోగులు వస్తున్నారు, వచ్చిన రోగులకు నిర్వహిస్తున్న పరీక్షలు వివరాలు వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు.వచ్చిన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వ ఆస్పత్రులపై రోగులకు మరింతగా నమ్మకాన్ని కలిగించాలన్నారు.
Intermediate Practicals:ఇంటర్ విద్యార్థుల ప్రాక్టికల్స్‌కు ఏర్పాట్లు పూర్తి..
అనంతరం గెద్దాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్‌ఎంఎం మెరిట్ స్కాలషిప్–2024 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులను కలెక్టర్ సుమిత్‌కుమార్, పీవో సూరజ్‌గనోరే అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. ప్రభుత్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాతీయ స్ధాయి పోటీ పరీక్షలో 8వ తరగతి విద్యార్థులు నెరం జ్యోతిమణి, పల్లాల దేవిప్రియాంక, కడబాల జగదీష్‌రెడ్డి, కానెం శ్రావణ్‌రెడ్డిలను గ్రామస్తులు పూలు జల్లుతూ ట్రాక్టర్‌పై ఊరేగించి సంతోషాన్ని చాటుకున్నారు.
Tenth Exams: విద్యార్థులకు పదవ తరగతి ఎంతో ముఖ్యమైన దశ..
రంపచోడవరం ఏవో లక్ష్మణరావు ఆయా విద్యార్థులను ప్రోత్సాహించేందుకు సమకూర్చిన జనరల్ నాల్జెడ్ పుస్తకాలు, పెన్నులు, అట్టలు, మెమెంటోలను కలెక్టర్, పీవో చేతులు మీదుగా అందజేశారు. ఎంపీపీ బందం శ్రీదేవి, ఎంపీటీసీ సభ్యుడు జగదీష్ కుంజం, సర్పంచ్ వడగల ప్రసాద్, ఎంఈఓ సత్యనారాయణ పాల్గొన్నారు.