Diploma Courses: ఉర్దూ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు.. ఇదే దరఖాస్తులకు చివరి తేదీ..!

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉర్దూ యూనివర్సిటీలో లభిస్తున్న డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తులు చేసుకోవచ్చని ఆ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకటించారు. విద్యార్థులకు ఉండాల్సి అర్హతల గురించి వివరిస్తూ ప్రవేశ పరీక్ష గురించి కూడా వెల్లడించారు..

కడప: కడప నగర శివార్లలోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్సీటీ (మను)పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమా కోర్సుకు అడ్మిషన్లు జరుగుతున్నాయని మను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ ముఖ్సిత్‌ ఖాన్‌ తెలిపారు. గురువారం ఇందుకు సంబంధించిన పోస్టర్స్‌ను కళాశాల అధ్యాపకులతో కలిసి ప్రిన్సిపాల్‌ ఆవిష్కరించారు.

CBSE New Syllabus: సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌..ఈ ఏడాది నుంచే అమల్లోకి

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాలలో మే 20 వరకు డిప్లమా కోర్సుకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్లికేషన్‌ పొందవచ్చని వివరించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు పదవ తరగతి (రెగ్యులర్‌ లేక ఓపెన్‌)లో ఉర్దూ మీడియంలో లేకపోతే ఉర్దూ సజ్జెక్టు చదువుకుని ఉండాలని సూచించారు. లేకపోతే పాలిటెక్నిక్‌ రెండేళ్లు, ఐటీఐ రెండేళ్లు లేకపోతే ఇంటర్‌ చదివి ఉండాలని తెలిపారు. డిప్లమా కోర్సు కోసం ప్రవేశ పరీక్ష జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నం కడప క్యాంపస్‌లో ఉంటుందని తెలిపారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌, అప్పరెల్‌ టెక్నాలజీ కోర్సులకు ఉన్నాయని చెప్పారు.

Good News For 10th Class Students : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ ప్రశ్నల‌కు మార్కులు.. ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..!

ఇందులో అబ్బాయిలకు అప్లికేషన్‌ రుసుం రూ. 550, అమ్మాయిలకు రూ. 350 చెల్లించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం కడప రిమ్స్‌ వద్ద ఉన్న మను కళాశాలను లేదా https://manuucoe.in/ reguleradmission సైట్‌ను సందర్శించి సమాచారం తెలుసుకోవాలన్నారు. అధ్యాపకుల డాక్టర్‌ మస్తార్‌వల్లి, డాక్టర్‌ హకీముద్దీన్‌ పాల్గొన్నారు.

Adani Green Energy: పునరుత్పాదక విద్యుత్‌లో అదానీ గ్రీన్‌ ఎనర్జీ రికార్డు.. దేశంలో తొలిసారి కొన్ని వేల మెగావాట్ల సామర్థ్యం

#Tags