Digital Development: ప్ర‌స్తుత‌ అభివృద్ధిలో కీల‌కపాత్ర పోషిస్తున్న డిజిట‌ల్ టెక్నాల‌జీ..

ప్ర‌స్తుతం అభివృద్ధి చెందుతున్న స‌మాజంలో ఈ డిజిట‌ల్ టెక్నాల‌జీ కీల‌కపాత్ర పోషిస్తోంది. నాగార్జున యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన స‌ద‌స్సులో వీసీ ఆచార్య మాట్లాడుతూ విద్యార్థుల‌కు అభివృద్ధి చెందుతున్న టెక్నాల‌జీ గురించి వివ‌రించారు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అనేక మార్పుల్లో డిజిటల్‌ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోందని వీసీ ఆచార్య పి. రాజశేఖర్‌ తెలిపారు. నాగార్జున యూనివర్సిటీ సైకాలజీ విభాగం, గుంటూరు స్పందన ఈదా ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సును శుక్రవారం వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ డిజిటల్‌ టెక్నాలజీ యువతపై అధిక ప్రభావం చూపిస్తోందని, దాన్ని అవసరం మేరకు ఉపయోగించుకుంటే ఎంతో అభివృద్ధి సాధించవచ్చని తెలిపారు.

TS Gurukul CET 2024: విద్యార్థులు నిబంధనలు పాటించాలి

డైరెక్టర్‌ , విభాగాధిపతి డాక్టర్‌ నాగరాజు సదస్సు నిర్వహణ ఉద్దేశాన్ని వివరించారు. స్పందన ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఈదా శామ్యూల్‌రెడ్డి మాట్లాడుతూ టెక్నాలజీని మంచి ఆలోచనల దిశగా మలచుకోవాలని సూచించారు. సైకాలజిస్ట్‌ డాక్టర్‌ అయోధ్య ఆర్‌. కె. కీలకోపన్యాసం చేశారు. డిజిటల్‌ టెక్నాలజీ నేటి రోజుల్లో వ్యసనంగా మారిందని, డ్రగ్స్‌ కంటే వేగంగా మనిషి మెదడును ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. దాన్ని నివారించకపోతే మనిషి మనుగడకు పెద్ద ప్రమాదం సంభవిస్తుందని చెప్పారు.

TS ECET & LAWCET Exam Dates And Schedule: ఈసెట్, లాసెట్‌ షెడ్యూల్‌ విడుదల

రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ, సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. గంగాధరరావు, అంతర్జాతీయ సదస్సు ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం. వసంతరావు, సౌత్‌ ఆఫ్రికా, ఉగాండా, అమెరికా, బంగ్లాదేశ్‌, పాలస్తీనా, కోస్టారిక, ఆఫ్రికా, ఆఫ్గానిస్థాన్‌, దేశాల నుంచి 15 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

#Tags