DSC Free Training: డీఎస్‌సీ ఉచిత శిక్షణకు దరఖాస్తులు.. చివరి తేదీ ఇదే..!

డిఎస్సీలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు డిప్యూటీ డైరెక్టర్‌. ఈ మెరకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు..

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాకు చెందిన షెడ్యూల్డ్‌ కులాల విద్యార్థినీవిద్యార్థులకు రెండు నెలల కాలానికి డీఎస్సీ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్‌ పి.నతానియేలు ఒక ప్రకటనలో తెలిపారు. భోజన వసతితో కూడిన రెసిడెన్షియల్‌ కోచింగ్‌ ఉంటుందన్నారు. జిల్లాకు చెందిన ఎస్సీ అర్హత కలిగిన షెడ్యూల్డ్‌ కులాలకు చెందిన అభ్యర్థులు ఈనెల 7 లోపు అంబేడ్కర్‌ భవన్‌లోని టీఎస్‌ స్టడీ సర్కిల్‌లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు రెండు సెట్స్‌ జిరాక్స్‌ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు.

Students for JEE Mains: ప్రశాంతంగా సాగిన తొలిరోజు జేఈఈ మెయిన్స్‌ పరీక్ష.. విద్యార్థుల హాజరు సంఖ్య ఇంత..!

ఏదైనా టెట్‌, బీఈడీ, డైట్‌, టీటీసీ ఉతీర్ణులై ఉండాలని తెలిపారు. ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ మార్కుల మెమో, బీఈడీ, టెట్‌, టీటీసీ, డైట్‌, ప్రొవిజనల్‌, కులం, ఆదాయం సర్టిఫికెట్లు, ఆధార్‌, రేషన్‌, బ్యాంక్‌ పాస్‌బుక్‌ జిరాక్స్‌, రెండు పాసుపోర్టు సైజ్‌ ఫొటోలతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 9885218053, 9573401227, 9177605511 నంబర్లను సంప్రదించాలని వివరించారు.

Water Break: పాఠశాలల్లో నీటి విరామం అమలు..

#Tags