Schools and Colleges Holidays 2023 : రేప‌టి నుంచి భారీగా సెల‌వులు.. స్కూల్స్‌, కాలేజీల మొత్తం సెలవులు లిస్ట్ ఇదే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : స్కూల్స్‌, కాలేజీల విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సెల‌వులు రేప‌టి నుంచి అంటే అక్టోబ‌ర్ 13వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.
dasara festival holidays 2023 for schools and college students

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.  తెలంగాణ‌లో 13రోజుల పాటు సెలవులు ఉండగా...తిరిగి అక్టోబర్ 26న పాఠశాలల తిరిగి ప్రారంభం కానున్నాయి.

☛ Dasara, Christmas and Sankranti Holidays 2023 : గుడ్‌న్యూస్‌.. ఈ సారి దసరా, క్రిస్మస్, సంక్రాంతి సెలవులు ఇవే.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఇంట‌ర్ కాలేజీల‌కు మాత్రం..

అన్ని జూనియర్ కళాశాలలకు ఈనెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సెలవులపై కీలక ప్రకటన వచ్చేసింది. ఈ జూనియ‌ర్ కాలేజీలకు ఈ నెల 25వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగనున్నాయి. సెలవుల తర్వాత అక్టోబరు 26 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం అవుతాయని ఇంటర్ బోర్డ్ ప్రకటనలో పేర్కొంది. దీంతో విద్యార్థులకు మొత్తం 8 రోజులు సెలవులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఈ సెలవులు వర్తిస్తాయని ప్రకటనలో స్పష్టం చేసింది ఇంటర్ బోర్డ్.

ఇక ఏపీలో మాత్రం..

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అక్టోబ‌ర్ 14వ తేదీ నుంచి అక్టోబ‌ర్ 24 వరకు ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. మొత్తం 10 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు స్కూల్స్ ఉండ‌నున్నాయి. ఈ దసరా సెలవుల అనంతరం అక్టోబ‌ర్ 25వ తేదీన‌ నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు ప్రకటించింది. అలాగే కాలేజీల‌కు కూడా 6 నుంచి 7 రోజులు పాటు ద‌స‌రా సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

#Tags