Women Industrialists: మహిళల కోసం బిజ్‌ మేళా.. స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలి..

మంగళవారం సాయంత్రం స్థానిక బుధవారపేటలోని మెరిడియన్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన బిజ్‌ మేళాలో పాల్గొన్నారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు ఎమ్మెల్యే. మహిళలు పారిశ్రమిక రంగంలో రాణించాలని తెలిపారు..

కర్నూలు: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్‌ సతీమణి సమీనా పిలుపు నిచ్చారు. మంగళవారం సాయంత్రం స్థానిక బుధవారపేటలోని మెరిడియన్‌ ఫంక్షన్‌ హాలులో బిజ్‌ మేళా నిర్వహించారు. మహిళలు తయారు చేసిన అన్ని రకాల ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు.

Medical College Admissions: ఏపీలో కొత్త వైద్య కళాశాలలకు దరఖాస్తులు.. మొత్తం ఎన్ని సీట్లంటే..?

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. అయితే, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో ఎంతో వృద్ధి సాధించారన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా నైపుణ్యలు మెరుగుపరుచుకుని రాణించవచ్చన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్‌ ఎస్వీ విజయమనోహరి మాట్లాడుతూ తమ బ్యాంకు ద్వారా పొదుపు గ్రూపులను బలోపేతం చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.

IIIT-H Launches New Courses: ట్రిపుల్‌ఐటీలో కొత్త కోర్సుకు శ్రీకారం

రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ గాజుల శ్వేతారెడ్డి మాట్లాడుతూ జగనన్న ప్రవేశ పెట్టిన వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎంతో మంది మహిళలు స్వయం ఉపాధిలో రాణిస్తున్నారన్నారు.

KU Semester Exams: కేయూ విద్యార్థుల సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇలా..!

#Tags