Government Schemes : బీటెక్ కోర్సు ఎంపికపై అవ‌గాహ‌న‌.. దీనికే ప్ర‌భుత్వ ప‌థ‌కాలు!

కన్వీనర్‌ కోటాలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులకే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. బీటెక్‌లో అన్ని బ్రాంచిలూ ముఖ్యమైనవే. విద్యార్థుల ఇష్టం మేరకూ ఎంచుకుని, కన్వీనర్‌ కోటాలో చేరవచ్చు. జేఎన్‌టీయూకే పరిధిలోని 160 కళాశాలల్లో దాదాపు 25 వేల నుంచి 30 వేల సీట్లు కన్వీనర్‌ కోటాలో ఉన్నాయి. ఏపీ ఈఏపీ సెట్‌ ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థీ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి.

– డాక్టర్‌ జీవీఆర్‌ ప్రసాదరాజు, ఏపీ ఎంసెట్‌ చైర్మన్‌, ఉప కులపతి, జేఎన్‌టీయూ–కాకినాడ

Nannaya University Professors : వ‌ర్సిటీ అధ్యాప‌కుల‌కు 'రూసా' ప్రాజెక్టులు..!

అవగాహన పెంచుకోవాలి

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు తాము చదవాలనుకున్న కోర్సులు, వాటికి లభిస్తున్న ఉపాధి అవకాశాలు, పరిశోధనలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలి. అలాగే అభిరుచి, ఆసక్తి ఉన్న కోర్సు ఎంపిక చేసుకోవడం ఉత్తమం. గణితంపై ఆసక్తి ఉన్నవారు ఈసీఈ, ఈఈఈ, సివిల్‌ డ్రాయింగ్‌పై ఆసక్తి ఉన్నవారు సివిల్‌ కోర్సులను ఎంపిక చేసుకోవాలి.

– ఎ.గోపాలకృష్ణ, ప్రొఫెసర్‌, మెకానికల్‌, జేఎన్‌టీయూకే

Teachers Promotions : పీహెచ్‌డీ అర్హత లేకపోయినా ఉపాధ్యాయులకు పదోన్నతులు మంజూరు..!

#Tags