Awareness Program: ఆన్‌లైన్‌ విధానంపై బోర్డు సూచనలు..

ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇంట‌ర్మీడియ‌ట్‌ విద్యాశాఖాధికారిణి ఎం.నీలావతి దేవి తెలిపారు. ఈ నేప‌థ్యంలో అధ్యాప‌కుల‌కు ఆన్‌లైన్‌లో విడియో రూపంలో శిక్ష‌ణను అందించారు..

నరసరావుపేట ఈస్ట్‌: ఇంట‌ర్మీడియ‌ట్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాల్ని ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేసేందుకు అధ్యాపకులు సిద్ధంగా ఉండాలని జిల్లా ఇంట‌ర్మీడియ‌ట్‌ విద్యాశాఖాధికారిణి ఎం.నీలావతి దేవి తెలిపారు. రావిపాడురోడ్డులోని ప్రైవేటు కళాశాలలో ఆదివారం జూనియర్‌ కళాశాలల అధ్యాపకులకు ఒకరోజు అవగాహన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఇంటర్‌ బోర్డు నుంచి ఆన్‌లైన్‌ ద్వారా మూల్యాంకనం చేసే విధానాన్ని అధికారులు వివరించారు. నీలావతి దేవి మాట్లాడుతూ తొలిసారిగా ఇంటర్‌ బోర్డు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో మూల్యాంకనాన్ని ప్రవేశపెడుతున్నదని తెలిపారు.

Case on Teacher: హ‌ద్దు దాటిన రీల్స్ బ్యాచ్‌.. చివ‌రికి మూల్యాంక‌నంలో కూడా!

ఈనెల 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంపై బోర్డు సూచనలు, సలహాలను వీడియోల రూపంలో అందజేస్తుందని చెప్పారు. అధ్యాపకులు ఇంటి నుంచి లేదా కళాశాలలోని కంప్యూటర్‌ ద్వారా చేయవచ్చని ఆమె సూచించారు. ఇంటర్‌నెట్‌ కేంద్రాల వద్ద నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరాదని, అటువంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధ్యాపకులంతా  తమ టీచర్‌ యూఐడీ ద్వారా లాగిన్‌ కావాలని ఆమె తెలిపారు. జిల్లాలోని టీచర్‌ యూఐడీ అధ్యాపకులకు వెబ్‌సైట్‌ వివరాలను అందజేస్తామని ఆమె చెప్పారు. కార్యక్రమంలో జిల్లాలోని వివిధ కళాశాలల అధ్యాపకులు పాల్గొన్నారు. 

 Digital Valuation: డిజిటల్ మూల్యాంక‌నంపై అవ‌గాహ‌న స‌ద‌స్సు..

#Tags