AP Residential Schools: ఏపీ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌, కాలేజీల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. చివ‌రి తేదీ ఇదే..

2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రామారావు ప్ర‌క‌టించారు..

నెల్లూరు: జిల్లాలోని ముస్లిం మైనార్టీలు ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలో చేరేందుకు 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ముస్లిం మైనార్టీ విద్యార్థులు నేరుగా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో విద్యనభ్యసించేందుకు దరఖాస్తు చేసుకొవచ్చన్నారు.

Child Choice in Education: కాలేజీ సమయం.. చదువు ఎంపికలో పిల్లల మాట కూడా వినండయ్యా..

రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలల్లో నేరుగా ఇంటర్మీడియట్‌లో మొదటి సంవత్సరం అడ్మిషన్స్‌ కోసం దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఆయా కళాశాలలు పాఠశాలల ప్రిన్సిపల్స్‌కు అనుమతులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో చేరబోవు మైనార్టీ విద్యార్థులు ఆయా పాఠశాలల, కళాశాలల ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు. అడ్మిషన్‌ కోసం పాఠశాలల్లో ఈ నెల 12వ తేదీ, కళాశాలల్లో ఈ నెల 18వ తేదీ తుది గడువని తెలిపారు. మైనార్టీ విద్యార్థులందరూ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Skill Development: యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపెంపొందించడమే లక్ష్యంగా..

#Tags