Skill Development: యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపెంపొందించడమే లక్ష్యంగా..
Sakshi Education

ఆళ్లగడ్డ: నైపుణ్యాభివృద్ధితో విద్యార్థులు మంచి అవకాశాలు సొంతం చేసుకొని, ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాపరెడ్డి అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 15 రోజులుగా స్థానిక కేవీ సుబ్బారెడ్డి కళాశాలలో నిర్వహిస్తున్న స్కిల్ శిక్షణ తరగతలు శుక్రవారం ముగిశాయి. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ యువతలో ఉద్యోగ నైపుణ్యాలు పెంపెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చామని చెప్పారు. అనంతరం శిక్షణ పొందిన 45 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ప్రిన్సిపాల్ శ్రీనాథ్, దేష్పాండే ఫౌండేషన్ మేనేజర్ ఉమాదేవి పాల్గొన్నారు.
Open Tenth and Inter: శుక్రవారం ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా సాగాయి..
Published date : 08 Jun 2024 03:25PM