AP Fee Reimbursement: వైఎస్సార్‌ జిల్లాలో 42,989 మందికి లబ్ధి... రూ. 31.67 కోట్లు జమ!

కడప: విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లల చదువులు తల్లిదండ్రులకు ఏమాత్రం భారం కాకూడదని జగనన్న విద్యా దీవెన పథకాన్ని అమలు చేస్తోంది.

సోమవారం చిత్తూరు జిల్లా నగరి బహిరంగసభ నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానం ద్వారా మూడోవిడత ద్వారా విద్యాదీవెన లబ్ధి మొత్తాన్ని బటన్‌ నొక్కి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. 2022–23 విద్యా సంవత్సరానికిగాను జిల్లాలో 42,989 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించారు. వీరి తల్లుల ఖాతాల్లో రూ. 31,67,28,121లు ముఖ్యమంత్రి జమ చేశారు.

Bengaluru: నెట్టింట వైర‌ల‌వుతున్న ఆటోవాలా ఇన్ఫిరేష‌న్ జ‌ర్నీ... ఎందుకో మీరు ఓ లుక్కేయండి.!

కలెక్టరేట్‌ వీసీ హాలు నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించిన కలెక్టర్‌ విజయరామరాజు అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఏపీ హజ్‌ కమిటీ చైర్మన్‌ గౌసులాజం, రాష్ట్ర పీఆర్‌శాఖ సలహాదారు నాగార్జునరెడ్డి, ఉద్యానశాఖ సలహాదారు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, బెస్త కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వెంకటసుబ్బమ్మ, పూసర్ల కార్పొరేషన్‌ డైరెక్టర్‌ విజయకుమారి, రాష్ట్ర విద్యా సంక్షేమ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నాగమల్లిక, కేంద్ర మిషన్‌ శక్తి కమిషన్‌ సభ్యురాలు మూలే సరస్వతి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ తదితరులు పాల్గొన్నారు.

NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

#Tags