Skip to main content

TSPSC AEE Exams Hall Tickets 2022 : ఏఈఈ పరీక్ష హాల్‌టికెట్లు విడుద‌ల‌.. డౌన్‌లోడ్ లింక్ ఇదే.. ప‌రీక్ష మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) రాత‌ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన హాల్‌టికెట్లుల‌ను విడుద‌ల చేసింది. ఏఈఈ రాత‌ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.

TSPSC AEE & AE Jobs : సిల‌బ‌స్ ఇదే..| ఇవి చ‌దివితే చాలా..ఉద్యోగం మీదే..
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఇలా..
టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఏఈఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

☛ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ (Click Here )

ఏఈఈ రాతపరీక్ష విధానం ఇలా.. : 

aee exam date

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) రాత‌ప‌రీక్ష‌ను. మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.

☛ TSPSC : ఏఈఈ, ఏఈ ఉద్యోగాల‌కు సంబంధించిన స్ట‌డీమెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

☛ TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

Published date : 17 Jan 2023 01:58PM

Photo Stories