Skip to main content

TSPSC AEE Exam Instructions 2023 : ఏఈఈ రాత‌ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు ఈ సూచ‌న‌లు పాటించాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) రాత‌ప‌రీక్ష‌ను జ‌న‌వ‌రి 22వ తేదీ (ఆదివారం) నిర్వ‌హించ‌నున్నారు.
AEE
aee exam instructions

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్‌లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్‌లో పేపర్-2 రాత‌పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 7 జిల్లాలో 176 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

TSPSC AEE & AE Jobs : సిల‌బ‌స్ ఇదే..| ఇవి చ‌దివితే చాలా..ఉద్యోగం మీదే..

1540 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ ​ఇంజినీర్​(ఏఈఈ) పోస్టులను భర్తీకి సెప్టెంబరు 3న నోటిఫికేషన్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ రాత‌ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్లుల‌ను కూడా విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 22వ తేదీన జ‌రిగే ఏఈఈ రాత‌ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు కింది సూచ‌న‌లు పాటించాలి.

☛ TSPSC : ఏఈఈ, ఏఈ ఉద్యోగాల‌కు సంబంధించిన స్ట‌డీమెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థుల‌కు ముఖ్య సూచనలు ఇవే..

aee exam

☛ పరీక్ష కేంద్రంలోకి వచ్చేందుకు పేపర్-1కు ఉదయం 8.30 నుంచి 9.45 వరకు, పేపర్-2 పరీక్షకు మధ్యాహ్నం 1.15 నుంచి 2.15 వరకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఆ తరవాత గేట్లు మూసివేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు. 
అంటే పరీక్ష సమయానికి 15 నిమిషాల ముందుగానే అభ్యర్థులు పరీక్ష హాల్‌లో ఉండాలి.
☛ ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాలి. అభ్యర్థులు హాల్‌టికెట్‌లో ఇచ్చిన పరీక్ష నిబంధనల గురించి క్షుణ్నంగా చదవాలి. వాటిని పాటించాల్సిందే.
☛ ఈ పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్లకు అనుమతిలేదు. ఒకవేళ ఎవరైనా అభ్యర్థులు తీసుకొస్తే వారిని డిబార్ చేస్తారు.
☛ పరీక్ష కేంద్రాన్ని చివరిక్షణంలో వెత్తుక్కోవడం కన్నా.. ముందుగానే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవడం మంచిది.
☛ హాల్‌టికెట్ మీద ఫోలో స్పష్టంగా లేనివారు, ఫోటో చిన్నగా ఉన్నవారు, ఫోట్ లేనివారు, సంతకం లేనివారు పరీక్షకు వచ్చేప్పుడు 3 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను వెంటతీసుకెళ్లాలి. గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్‌తోపాటు అండర్‌టేకింగ్ తీసుకోవాలి. దాన్ని పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్‌కు సమర్పించాలి. అలా కాని పక్షంలో పరీక్షకు అనుమతించరు.

☛ AEE హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ డైరెక్ట్ లింక్ (Click Here )

పరీక్ష కేంద్రాలు ఇవే : 
కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హన్మకొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి.

ఏఈఈ రాతపరీక్ష విధానం ఇలా.. : 

aee exam system

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) రాత‌ప‌రీక్ష‌ను. మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1 (జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్)కు 150 మార్కులు, పేపర్-2(అభ్యర్థి సబ్జెక్టు)కు 300 మార్కులు కేటాయించారు. పేపర్-1లో 150 ప్రశ్నలు-150 మార్కులు, పేపర్-2లో 150 ప్రశ్నలు 300 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాలుగా కేటాయించారు.

☛ TSPSC AEE Notification 2022: 1540 పోస్టులకు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. పరీక్ష విధానం, ప్రిపరేషన్‌.. ఇలా

Published date : 20 Jan 2023 04:17PM

Photo Stories