Skip to main content

Success Story: చిన్న వ‌య‌స్సులోనే సొంత కంపెనీ..నెలకు లక్షల్లో ఆదాయం ఇలా..

జీవితంలో ఎదగాలంటే కేవలం టాలెంట్‌ ఒక్కటే సరిపోదు ఇది చాలా మంది అనేమాట. అదినిజం కాదు.
Mohit Churiwal
Mohit Churiwal

ప్రతిభ ఉంటే కోట్లకు కోట్ల డబ్బు ఎలా సంపాదించవచ్చో ఈ గుజరాతీ టీనేజ్‌ బాలుడు నిరూపించాడు. మోహిత్‌ చురివాల్‌ కేవలం 15 యేళ్ల వయసులోనే టిక్‌టాక్‌, ఏయమ్‌పీ మీ వంటి అనేక బ్రాండ్లలో పనిచేశాడు. ఇక 18 యేళ్లకి ఏకంగా కంపెనీయే ప్రారంభించాడు. అతని విజయయాత్ర ఎలా ప్రారంభమైందంటే..

డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు..
అవును! ఇతని జర్నీ అంతా కూడా చాలా భిన్నంగా ఉంటుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన మోహిత్‌ చురివాల్‌ స్కూల్లో చదివేటప్పటినుంచే ఇంటర్‌నెట్‌లో తన ప్రయత్నాలు ప్రారంభించాడు. 15 యేళ్ల వయసులో ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌ తెరిచి, దాన్ని 7 లక్షల రూపాయలకు అమ్మేశాడు. యూ ట్యూబ్‌ ఛానెల్‌ కూడా ప్రారంభించాడు కానీ ముందుకు వెళ్లలేదు. తర్వాత ఒక సోషల్‌ పేజ్‌ను క్రియేట్‌ చేశాడు. ఐతే అది హ్యాక్‌ అయ్యింది. రెండు సార్లు విఫలమయ్యాక ఇంకొంచెం కష్టపడాలని నిర్ణయించుకున్నాడు. 12వ తరగతి చదివేటప్పుడు అతని మొదటి సంపాదన అక్షరాల 7 లక్షల రూపాయలు. ఆ తర్వాత సొంతంగా కంపెనీ ప్రారంభించాలని అనుకున్నాడు. ఐతే అందుకు చాలా డబ్బు అవసరం అవుతుంది. డబ్బు లేదని తన ప్రయత్నాలు మానుకోలేదు. అనేక బ్రాండెడ్‌ కంపెనీల్లో పనిచేయడం ప్రారంభించాడు.

స్వయం కృషితోనే

Mohit Churiwal Success Story


తర్వాత 18 యేళ్లకు తన కలను నెరవేర్చుకున్నాడు. సొంత కంపెనీ ప్రారంభించి నెలకు 3 లక్షల రూపాయలు సంపాదించడం ప్రారంభించాడు. ఆ కంపెనీ లాభాలబాట పట్టగానే మరో కంపెనీ ప్రారంభించాడు. ఐతే ఈ ప్రయాణంలో ఎవరి దగ్గరా (కుటుంబంతో సహా) డబ్బుకోసం ఎప్పుడూ చేయిచాచలేదు. స్వయం కృషితో ప్రారంభించి మునుముందుకు నడిపించాడు. అద్భుతం కదా! మోహిత్‌ చురివాల్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఎన్నో ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా మిగిలిన నేటి యువత కొత్తగా కెరీర్‌ నిర్మించుకోవచ్చు.

Published date : 17 Dec 2021 03:43PM

Photo Stories