CLAT 2023 Results Link : క్లాట్ 2023 ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: దేశంలోని లా యూనివర్సిటీలలో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(CLAT) 2023 ఫలితాలను డిసెంబర్ 23వ తేదీన విడుదల చేశారు. క్లాట్-2023 పరీక్ష డిసెంబర్ 18వ తేదీన జరిగిన విషయం తెల్సిందే.
ఈ జాతీయస్థాయి పరీక్ష క్లాట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే.. ప్రతిష్టాత్మకమైన నేషనల్ లా యూనివర్సిటీల్లో.. ఐదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. క్లాట్‌లో ప్రతిభ చూపి.. నేషనల్ లా యూనివర్సిటీల్లో కోర్సు పూర్తి చేసుకుంటే..న్యాయవాద వృత్తితోపాటు.. కార్పొరేట్ రంగంలోనూ.. కొలువుదీరొచ్చు. ఈ ఫలితాలతో పాటు ఫైనల్ కీ ని కూడా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలతో పాటు.., రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 127 సెంటర్స్‌లో ఈ క్లాట్ ఎగ్జామ్ 2023ను నిర్వహించారు.
Published date : 23 Dec 2022 05:51PM