Skip to main content

AP Assembly Speaker: ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు!

Jana Sena Party  AP Assembly Speaker  Chintakayala Ayyannapatra, senior TDP leader  Andhra Pradesh Legislative Assembly

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా టీడీపీ సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. రేసులో పలువురు సీనియర్ల పేర్లు వినిపించినప్పటికీ.. చివరకు అయ్యన్న వైపే అధిష్టానం మొగ్గుచూపించినట్లు సమాచారం. ఇక డిప్యూటీ స్పీకర్‌ పదవి జనసేనకే వెళ్లే అవకాశాలున్నాయి. 
Syamala Rao: టీటీడీ కొత్త‌ ఈవోగా నియమితులైన‌ శ్యామ‌ల‌రావు

జనసేన నుంచి నెల్లిమర్ల(విజయనగరం) శాసనసభ సభ్యురాలు మాధవి లోకం పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. చీఫ్‌విప్‌గా ధూళిపాళ నరేంద్రకు అవకాశం దక్కవచ్చని టాక్‌. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Published date : 17 Jun 2024 11:06AM

Photo Stories