Skip to main content

Priyamvada Natarajan Listed In Times 2024 List: ఎవరీ ప్రియంవదా నటరాజన్? ఏకంగా టైమ్‌ మ్యాగజైన్‌లో..!

Times  Influential Indian Scientist  Priyamvada Natarajan Listed In Times 2024 List  Indian woman astronomer Priyamvada Natarajan

ఈ ఏడాది టైమ్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారతీయ మహిళ ఖగోళ శాస్త్రవేత్త ప్రియంవదా నటరాజన్‌ కూడా ఉన్నారు. టైమ్‌ మ్యాగజైన్‌ ఈసారి, నాయకులు, స్పూర్తిదాయమైనవాళ్లు, ఆయా రంగాల్లో ప్రఖ్యాతి గాంచిన వారుగా వర్గీకరించి మరీ వందమంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను విడుదల చేసింది.

ఈసారి ఆ జాబితాలో చాలామంది ప్రతిభావంతులైన భారతీయలకు స్థానం లభించడం విశేషం. ఈ జాబితాలో భారత సంతతి మహిళ శాస్త్రవేత్తకు ఎలా చోటు దక్కిందంటే..

ఆమెకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు..

  • భారత సంతతి అమెరికన్‌ అయిన ప్రియంవద నటరాజన్‌ యేల్‌ యూనివర్సిటీలో భారతీయ ప్రొఫెసర్‌. ఆమె అక్కడ ఖగోళ శాస్త్ర విభాగానికి అధ్యక్షురాలు, మహిళా ఫ్యాకల్టీ ఫోరమ్‌ చైర్‌పర్సన్‌ కూడా.
  • ఆమె ప్రాథమిక విద్య ఢిల్లీ పబ్లిక​ స్కకూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఫిజిక్స్ అండ్‌ మ్యాథమెటిక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
  • తదనంతరం నటరాజన్‌ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. ఆ టైంలోనే ఆమె ప్రతిష్టాత్మకమైన ఐజాక్ న్యూటన్ విద్యార్థిని, ట్రినిటీ కళాశాలలో సహచరురాలు కూడా.
  • ఆమె ఎక్కువగా మాసివ్‌ బ్లాక్‌హోల్స్‌పై విస్తృతంగా పరిశోధనలు చేసింది. 2022లో లిబర్టీ సైన్స్ సెంటర్ జీనియస్‌ అవార్డుని గెలుచుకుంది. అంతేగాదు మెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్‌), అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైన్స్ (ఏఏఏఎస్‌), గుగ్గెన్‌హీమ్ ఫౌండేషన్ మరియు రాడ్‌క్లిఫ్ ఇన్స్టిట్యూట్ వంటి అనేక సంస్థల నుంచి ఫెలోషిప్‌లు అందుకుంది.
  • అలాగే 2016లో వచ్చిన 'మ్యాపింగ్ ది హెవెన్స్: ది రాడికల్ సైంటిఫిక్ ఐడియాస్ దట్ రివీల్ ది కాస్మోస్'రాసింది కూడా ప్రియంవదానే. 
Published date : 18 Apr 2024 05:10PM

Photo Stories