Andhra University: ఏయూలో డిజిటల్ కాగ్నెటివ్ థెరపీ సెంటర్ ప్రారంభం
ఏయూక్యాంపస్: ఏయూలో డిజిటల్ కాగ్నెటివ్ థెరపీ సెంటర్ ఏర్పాటైంది. కెనడాకు చెందిన ఆరెంజ్ న్యూరో సైన్సెస్ సంస్థ ఏయూతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా అధునాతన డిజిటల్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ని ఏయూకు అదించింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని నార్త్ క్యాంపస్ హెల్త్ సెంటర్‌లో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో ఆరెంజ్ న్యూరో సైన్స్‌స్ సంస్థ సీఈఓ డాక్టర్ వినయ్ సింఘ్ ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాసరావు, సైకాలజీ విభాగాధిపతి ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జి.శశిభూషణ రావు తదితరులు పాల్గొన్నారు. దీని సహాయంతో విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేసి.. అవసరమైన వారికి వెంటనే చికిత్స అందించవచ్చని వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. భవిష్యత్తులో సౌత్ క్యాంపస్‌లో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.