Staff Nurse Counselling : నేటి నుంచి స్టాఫ్ నర్స్ నియామకాల కౌన్సెలింగ్ ప్రారంభం.. రోజుకు 50 మందికి చొప్పున..!
కడప రూరల్: ఐదో విడత స్టాఫ్ నర్స్ నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇందులో భాగంగా మంగళవారం నుంచి సుమారు 206 మందికి నియామక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిజానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో వైద్య ఆరోగ్య శాఖ విభాగాల్లో వివిధ కేడర్‌లకు సంబంధించి పెద్ద ఎత్తున నియామకాలు జరిగాయి. అందులో భాగంగా కడపలోని వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4) పరిధిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి.
New Climate Resilient: నూతన వంగడాలను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
ఇప్పటికే నాలుగు విడతల్లో నియామకాలు..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2023 నవంబర్‌లో స్టాఫ్ నర్స్ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. నిబంధనల ప్రకారం, మెరిట్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక జాబితాను సిద్ధం చేశారు. నాలుగు విడతలుగా నియామక కౌన్సెలింగ్‌ను నిర్వహించారు. ఒక విడతకు 100 మందికి పైగా నియామక పత్రాలను అందజేశారు. ఐదవ విడతలో పులివెందుల, మదనపల్లె, ఆదోని మెడికల్ కాలేజీల్లో మొత్తం 206 మందిని స్టాఫ్ నర్స్ నియామకాలను చేపట్టడానికి జాబితాను సిద్ధం చేశారు.
Paris Olympics: ఒలింపిక్స్ విజేతలకు నగదు బహుమతులు.. ఎవరికి ఎంత ఇస్తున్నారో తెలుసా..?
అంతలోపే ఎన్నికల కోడ్ రావడంతో నియామక ప్రక్రియ నిలిచింది. అనంతరం టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదట్లోనే స్టాఫ్ నర్స్ నియామక ప్రక్రియను నిలుపుదల చేశారు. దీంతో కౌన్సెలింగ్‌కు హజరైన అభ్యర్ధులు నిరాశగా వెనుతిరిగారు. పైగా వారిలో ఐదవ విడత నియామకాలపై సందిగ్ధం నెలకొంది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో 206 మంది స్టాఫ్ నియామకాలకు మార్గం సుగమమైంది. ఇంకా 200 మందికి పైగా స్టాఫ్ నర్స్ నియామకాలు జరగాల్సి ఉంది.
నేటి నుంచే కౌన్సెలింగ్.. రోజుకు 50 మంది చొప్పున కౌన్సెలింగ్
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, నిబంధనల మేరకు 206 మందికి కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాలు చేపడుతున్నాం. రోజుకు 50 మందికి చొప్పున కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. ఈ నెల 13, 14, 16, 17వ తేదీల్లో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నాం. ఇందుకు సంబంధించిన సమాచారంను ఎంపికైన అభ్యర్ధులకు తెలియపరిచాం. అభ్యర్ధులు సకాలంలో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
– డాక్టర్ శ్రీనివాసులు, రీజనల్ డైరెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం.
NRIF Rankings : ఉన్నత విద్యాసంస్థలకు ఎన్ఆర్ఐఎఫ్ ర్యాంకులు.. ఈ విభాగాల్లో..