Medical College works: మెడికల్ కళాశాల పనుల పరిశీలన
జనగామ: జనగామ మండలం చంపక్‌హిల్స్ మాతా శిశుసంరక్షణ (ఎంసీహెచ్) ఆరోగ్య కేంద్రం ఆవరణలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల పనులను స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదివారం పరిశీలన చేశారు. రాష్ట్రంలోని 9 మెడికల్ కళాశాలలను ఈ నెల 15న హైదరాబాద్ నుంచి సీఎం కేసీఆర్ వర్చువల్‌గా ప్రా రంభించనున్న నేపధ్యంలో మంత్రి, ఎమ్మెల్యే పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల బోధన తరగతులతో పాటు ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ డిపార్టుమెంట్లకు
కేటాయించే గదులకు సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వైద్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలు, ఆశలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. వారి వెంట ఆస్పత్రుల సమన్వయ కర్త డాక్టర్ సుగుణాకర్‌రాజు, ఎంసీహెచ్ ఆర్‌ఎంఓ, డాక్టర్ శంకర్, ఏఎంసీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, గాంధీ నాయక్, ఉల్లెంగుల సందీప్, దేవునూరి సతీష్, మిద్దెపాక లెనిన్ తదితరులు ఉన్నారు.